WG: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ మార్చి 9న రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో, జగన్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శేషుబాబుతో పాటు ఆయన సతీమణి శశికళ, రవిశంకర్ నారాయణ (IRS), సిద్ధార్థ తదితరులు జగన్‌ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు.
NTR: మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో రూ.20 లక్షలతో తాగునీటి పైపులైన్ నిర్మాణానికి, చిలుకూరులో రూ.25 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వచ్ఛంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ప్రధాన ధ్యేయంతో కృషి చేస్తునమన్నారు.
MBNR: జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పాత ఆసుపత్రికి తరలించవద్దని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ప్రస్తుత భవనం పార్కింగ్, ఇతర వసతులతో సౌకర్యంగా ఉందని, సొంత భవనం నిర్మించే వరకు దీన్ని మార్చవద్దని ఆయన కోరారు. ప్రజా సౌకర్యార్థం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పునరాలోచించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ADB: నేరడిగొండలోని రోలుమామడ మాజీ సర్పంచ్ హర్కా యాదవరావు, పలువురు నాయకులు MLA అనిల్ జాదవ్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
HNK: నక్కలగుట్టలోని NPDCL భవన్‌ను సోమవారం సాయంత్రం తెలంగాణ SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు అత్యంత పారదర్శకంగా జరగాలని, గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాక్ లాగ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో CMD వరుణ్ రెడ్డి ఉన్నారు.
అనంతపురం: రంజాన్ మాసంను పురస్కరించుకుని అనంతపురం నగరంలోని 2వ రోడ్ వద్ద ఉన్న బాబుద్ధిన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం హాజరయ్యారు. మసీదు నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మసీదు కమిటీ మెంబర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MNCL: కార్మిక, గనుల శాఖ మంత్రి, చెన్నూరు MLA గడ్డం వివేక్ వెంకటస్వామిని, మందమర్రి పట్టణ యూత్ యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్ సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు కిరణ్ పేర్కొన్నారు.
NZB: రుద్రూర్లో తనపై దాడి జరిగిందని పేర్కొంటూ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బోధన్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సోమవారం రుద్రూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అయితే ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రుద్రూర్ ఎస్సైపై బోధన్ ఏసీపీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.
ELR: టి.నరసాపురం మండలం బంధంచర్ల గ్రామానికి చెందిన ముగ్గురుని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేసినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా పాత నాటు సారా కేసుల్లో ముద్దాయిలు అయిన గుమ్మల్ల లక్ష్మణరావు, కొండా పుల్లయ్య, రాచప్రోలు అరుణ్ అనే వ్యక్తులపై బైండోవర్ విధించడం జరిగిందన్నారు. సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.
MDK: మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ హంసి మనోహర్ తెలిపారు. గ్రామంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ తో కలిసి గ్రామంలో పర్యటించారు. విద్యుత్ సమస్యలు గుర్తించడంతోపాటు విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరాన్ని నమోదు చేశారు. ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్, వార్డు సభ్యులు బోనాల బాబు పాల్గొన్నారు.
అన్నమయ్య: రామసముద్రం మండలం గంపనంపల్లికి చెందిన పవిత్ర (17) తిరుపతిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 20న జ్వరం రావడంతో పద్మావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. పరిస్థితి విషమించడంతో రుయా ఆసుపత్రికి తరలించగా.. ఇవాళ చికిత్స మృతి చెందింది. మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అన్నమయ్య: సుండుపల్లె మండలం చిన్నగొల్లపల్లె పాత జంగంపల్లెలో జరగనున్న శ్రీ గౌరిసమేత జంగమేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, కల్యాణ మహోత్సవాలకు హాజరు కావాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ప్రసాద్ బాబును గ్రామస్తులు ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నారులు వేసిన దశావతార వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విష్ణుమూర్తి పది రూపాలను ప్రతిబింబించేలా రంగురంగుల దుస్తులతో చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో కళకళలాడింది. చిన్నారుల ప్రతిభను చూసి భక్తులు, ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ కేవీ రమణ సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 51 అర్జీలను స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
NLG: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) చేసుకోవడానికి ఈనెల 25 వరకు గడువు విధించారని ఆ యొక్క గడువును మరో 10 రోజులు పొడగించాలని కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో విజ్ఞప్తి చేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి మరో పది రోజులు గడువు పెంచాలని కోరారు.