• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అమరావతికి చట్టబద్ధత రైతుల విజయం’

AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు మరికాసేపట్లో లోక్‌సభ ముందుకు రానుంది. దీనపై MP కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ‘ఇది రైతుల విజయం. 2028 నాటికి దేశం గర్వించే నగరంగా అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. దీన్ని అడ్డుకుంటే YCPకి తర్వాతి ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావు’ అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు.

April 1, 2026 / 10:37 AM IST

బీఆర్ఎస్ పరిశీలకులుగా మాజీ మంత్రులు

MNCL: ఈ నెల 4న క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛై‌ర్మన్, వైస్ ఛై‌ర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ పరిశీలకులుగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ను పార్టీ అధిష్టానం నియమించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లను సమన్వయపర్చి పదవులు కైవసం చేసుకునే బాధ్యతను పరిశీలకులకు అప్పగించారు. గత ఫిబ్రవరి 17న చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది.

April 1, 2026 / 10:36 AM IST

ప్రబుత్వ సంక్షేమ పధకాలు పారదర్శకంగా ప్రజలకు చేరాలి

VZM: వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్‌ అందజేయాలని బొబ్బిలి MPDO రవికుమార్ సూచించారు. బుధవారం కోమటి పల్లి, కలవరాయి గ్రామాల్లో పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. లబ్ధిదారుల వద్దకు స్వయంగా వెళ్లి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరాలని ఆయన ఆదేశించారు.

April 1, 2026 / 10:35 AM IST

నేటి నుంచి టోల్ గేట్ల వద్ద ‘నో క్యాష్’

జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఇవాళ్టి నుంచి నగదు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇకపై ఫాస్టాగ్ లేదా UPI ద్వారానే రుసుము చెల్లించాలి. రద్దీ తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు NHAI ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని, డిజిటల్ చెల్లింపులకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.

April 1, 2026 / 10:34 AM IST

అకాల వర్షంతో రైతులకు తీరని నష్టం

SDPT: అకాల వర్షంతో బెజ్జంకి మండలంలోని రైతులు నేలవాలిన వరి, మొక్కజొన్న పంటలు, రాలిపోయిన మామిడికాయలతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు. వెంటనే అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, బాధిత రైతులకు పూర్తి స్థాయి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు పార్టీ అండగా ఉంటుందన్నారు

April 1, 2026 / 10:34 AM IST

నేటి నుంచి లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం!

BDK: రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీకి ఈరోజు శ్రీకారం చుట్టనున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. బుధవారం నుంచి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నది.

April 1, 2026 / 10:33 AM IST

“జిల్లాకు రైల్వే లైన్ మంజూరు చేయాలి”

BHPL: జిల్లాలో వెలికితీసిన బొగ్గును రవాణా చేయడానికి ట్రక్కులపై ఆధారపడకుండా రైల్వే లైన్ మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం తగ్గడంతో పాటు సరుకు రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. రైల్వే లైన్ మంజూరు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరిత చర్యలు చేపట్టాలని కోరారు.

April 1, 2026 / 10:32 AM IST

హెల్మెట్ లేకుండా గ్రామంలోకి రావొద్దు!

TG: హెల్మెట్ లేకుంటే గ్రామంలోకి ద్విచక్ర వాహనాలను అనుమతించకూడదని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మం. వెంకట్రాంపురం గ్రామస్థులు తీర్మానించారు. ఈ మేరకు ‘ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, లేదంటే గ్రామంలోకి ప్రవేశం లేదు’ అంటూ పంచాయతీ పాలకవర్గం ఓ బ్యానర్ ఏర్పాటు చేసింది. వారం క్రితమే గ్రామంలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించి.. హెల్మెట్, ప్రమాదాలపై వివరించారు.

April 1, 2026 / 10:32 AM IST

ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కాంబోలో ఓ భారీ సూపర్ హీరో మూవీ రాబోతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది రూపొందనుందట. బాసిల్ ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని, అల్లు అర్జున్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నారని టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

April 1, 2026 / 10:31 AM IST

పన్నుల వసూళ్లలో అద్దంకి రికార్డు..!

BPT: పన్నుల వసూళ్లలో అద్దంకి మున్సిపాలిటీ రికార్డు సృష్టించింది. మార్చి 31 నాటికి జిల్లాలో మొదటి స్థానంలో, రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచినట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. మొత్తం రూ.5.71 కోట్ల లక్ష్యానికి గాను రూ.4.61 కోట్లు (80.5%) వసూలు చేసినట్లు పేర్కొన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన పట్టణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

April 1, 2026 / 10:31 AM IST

మిషన్ భగీరథ నీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం

GDWL: మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో మిషన్ భగీరథ నల్లాలకు ఆన్-ఆఫ్ ట్యాప్లు (వాలు) లేకపోవడంతో తాగునీరు భారీగా వృథా అవుతోంది. ఉదయం, రాత్రి తేడా లేకుండా నీరు నేలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టేందుకు వెంటనే నల్లాలకు ట్యాప్లు అమర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

April 1, 2026 / 10:30 AM IST

శ్రీకాకుళంలో నేటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ తరగతులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తిరిగి ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండగా జూన్ 1 నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 160కి పైగా కళాశాలల్లో సుమారు 19వేల మంది హాజరుకానున్నారు.

April 1, 2026 / 10:30 AM IST

జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ సత్తా

PPM: ఖేలో ఇండియా ఆస్మిత జాతీయ కిక్ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పట్ట ణానికి చెందిన బి. మైథిలి సత్తాచాటింది. చెన్నైలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొన్న విద్యా ర్థిని తృతీయ స్థానం సాధించినట్లు శిక్షకుడు ఎస్. అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులందరూ అభినందనలు తెలిపారు.

April 1, 2026 / 10:30 AM IST

చురుగ్గా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

AKP: కోటవురట్ల మండలంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఎంపీడీవో చంద్రశేఖర్ ఎండపల్లి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. సాయంత్రంలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

April 1, 2026 / 10:30 AM IST

మహిళలకు ఒక వరంగా మారిన మహాలక్ష్మి పథకం

ASF: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వారికి వరంగా మారిందని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల మార్చ్ నెల వరకు జిల్లాలో రూ.77 కోట్ల ఆదా జరిగిందని పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని, మహిళల్లో ధైర్యం పెరిగిందన్నారు.

April 1, 2026 / 10:29 AM IST