PDPL: రామగుండం ఓల్డ్ బజార్కు చెందిన కుసుమ కుమారి ఇంటి ముందు నిలబడి ఉండగా దుండగులు తెగబడ్డారు. ‘అక్కా బాగున్నావా’ అని పలకరిస్తూనే, రెప్పపాటులో ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని బైక్పై పరారయ్యారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ రమేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.
NGKL: లింగాల మండలం సలేశ్వర కొండగుహల్లో పాండవులు వనవాసం చేసిన క్షేత్రమే ఇప్పటి సలేశ్వరం. సలేశ్వర గుహల్లో పాండవులు బస చేసినట్టు స్థల పురాణం చెబుతుంది. ఇదే ప్రాంతంలో శివపార్వతులు తపస్సు చేసినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. సలేశ్వరం క్షేత్రాన్ని పూర్వకాలంలో శైలపురంగా పిలిచేవారని స్థానికులు చెబుతారు. దేవాలయంలో చెంచులు పూజారులుగా వ్యవహరిస్తారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ అవకాశాన్ని పొందాలని ఇన్‌ఛార్జ్ కమిషనర్ గణేష్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి గాను ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ప్రకటించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆస్తి పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
KMM: వైరా మండలం గ్రీన్ ఫీల్డ్ హైవేను NHAI ప్రాజెక్టు మేనేజర్ దివ్యతో కలిసి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం పరిశీలించారు. త్వరలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామం నుంచి వైరా పట్టణం రింగ్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు.
ATP: బెంగళూరు-అనంతపురం-బెంగళూరు మెము (66559/60) ప్యాసింజర్ రైలుకు చెన్నసంద్ర స్టేషన్‌లో స్టాపింగ్ రద్దును మే నెలాఖరు వరకు పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అక్కడ చేపడుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడమే ఇందుకు కారణమని వివరించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
CTR: అక్రమంగా రవాణా చేస్తున్న రూ.5 లక్షల విలువ చేసే 24 సంచుల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు గుడిపాల పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి పశుమంద క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిత్తూరు నుంచి తమిళనాడుకు పొగాకు ఉత్పత్తులు ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.
NLR: పోలీసుల తనిఖీలలో భయంతో రైలు నుంచి దూకి ఓ దొంగ మృతి చెందిన ఘటన గూడూరులో మంగళవారం రాత్రి జరిగింది. రైల్వే జీఆర్పీ సీఐ సుధాకర్ ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతి నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మెడలో బంగారు చైనును ఓ వ్యక్తి అపహరించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాగా పోలీసులు చెకింగ్ చేస్తుండగా భయంతో రైలు నుంచి దూకి చనిపోయాడని తెలపారు.
జగిత్యాల ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో “ఎన్జిఓలు & అభివృద్ధి రంగం “పై రెండు రోజుల అకడమిక్ ప్రోగ్రాం ముగిసింది. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అశోక్ అధ్యక్షతన వాలెడిక్టరీ జరిగింది. అతిథులు సుజాత, శ్రీధర్ విద్యార్థులకు గ్లోబల్ స్కిల్స్, సామాజిక బాధ్యతపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో సామాజిక అవగాహన, నైపుణ్యాలు పెరిగినట్లు నిర్వాహకులు అన్నారు.
TG: కేరళంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. రెండు రోజుల పాటు కేరళంలోనే సీఎం ఉండనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.
NRML: కడెం మండలంలోని ఉడుంపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాత ఉట్నూరుకు చెందిన గొడిపెల్లి నడిపి మల్లయ్య, మల్లేష్, మల్కరి దుర్గయ్య ఖానాపూర్ కు పని నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఉడుంపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా నడిపి మల్లయ్య మృతి చెందాడు.
SS: కదిరి రూరల్ మండలం సున్నపగుట్ట తండాలోని మజీద్ ఏ ఆయేషా పునర్నిర్మాణానికి వైసీపీ సీనియర్ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. మసీదు కమిటీ సభ్యులకు ఈ నగదును అందజేశారు. దైవ ప్రార్థనా మందిరాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అల్లబకాష, మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఖలందర్ పాల్గొన్నారు.
SRD: రఘునందన్ రావు MP కావడానికి “త్రిపాత్రాభినయం”పోషించారని పటాన్ చెరువు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, రాజులు అన్నారు. HITTV ప్రతినిధితో మాట్లాడుతూ ఎన్నోఏళ్ల చిరకాల మిత్రుడు MP రఘునందన్ రావు అని కలిసిన సందర్భంగా మాట్లాడుతూ.. పటాన్ చెరువులో పాఠాలు నేర్పే టీచర్‌గ, జర్నలిస్టుగా, న్యాయవాదిగా, తెలంగాణ ఉద్యమ నేతగా ఎన్నో పాత్రలు పోషించారని అన్నారు.
TG: హైదరాబాద్‌లోని సాగర్ రింగ్ రోడ్డు దగ్గర ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. LPG గ్యాస్ కొరత ఉండటంతో ఓ బంక్ ఎదుట నిరసనకు దిగారు. రెండు వారాలుగా గ్యాస్ దొరకక ఇబ్బందులు పడుతున్నామని.. కిలోమీటర్ల మేర క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
KRNL: పాత కక్షలతో వ్యక్తిపై కత్తి, రాడ్లతో దాడి చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా త్రీటౌన్ సీఐ పి.శేషయ్య తెలిపారు. ఖడక్పురాకు చెందిన షేక్ మహమ్మద్ అల్తాఫ్‌పై మార్చి 29న ప్రభుత్వ ఆసుపత్రిలో దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై నమోదు చేసిన కేసులో ST సోహెల్, చాకలి వసంత కుమార్‌ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
ప్రకాశం జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెంచూరియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువతకు ప్రాధాన్య రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించనున్నారు.