KRNL: మంగళవారం ఎమ్మిగనూరు-మంత్రాలయం జాతీయ రహదారిపై కల్లుదేవకుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక జింక మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందిన అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి, ఖననం చేస్తామని FBO నాగేష్ తెలిపారు.
PDPL: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సత్వర వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. వైద్యులు పూర్తి పని గంటల్లో అందుబాటులో ఉండాలని, ఓపీ టోకెన్లు, ల్యాబ్ ఫలితాలు రోగులకు సకాలంలో అందేలా చూడాలని సూచించారు. ఆసుపత్రిలో దిశా సూచికలు ఏర్పాటు చేయాలని, ప్రతి విభాగం సేవల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X'(ట్విట్టర్) యూజర్లకు షాక్ ఇచ్చింది. నిన్న అర్ధరాత్రి నుంచి X సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పేజీలు లోడ్ కాకపోవడం, లాగిన్ సమస్యలతో వేలాది మంది ఇబ్బంది పడ్డారు. డౌన్‌డిటెక్టర్ నివేదికల ప్రకారం ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే, దీనిపై సంస్థ యాజమాన్యం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
NZM: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బండ్లపై విక్రయించే నాసిరకం ఐస్‌క్రీంల వల్ల చిన్నారులు అస్వస్థతకు గురవుతుండటంతో గ్రామ పంచాయతీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే డిచ్‌పల్లి, ముగ్పాల్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో, KMR జిల్లా తెల్గపూర్‌లో ఐస్‌క్రీం విక్రయాలను నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 వరకు జరిమానా విధిస్తామన్నారు
BDK: పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఇవాళ చండీ హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో రజనీకుమారి తెలిపారు. చండీ హోమంలో పాల్గొనే భక్తులు ముందుగానే రూ. 2516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని అన్నారు. చండీ హోమంలో పాల్గొనే దంపతులకు శేష వస్త్రంతో పాటు ప్రసాదం అందజేయడం జరుగుతుందని తెలిపారు.
TPT: వెంకటగిరి-గూడూరు మార్గంలో నిడిగల్లు రైల్వే స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి ఓ రైలు ఆగింది. ఆ సమయంలో ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలి మెడలోని బంగారు చైను దొంగలించాడు. ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వెందోడు-రేణిగుంట రైల్వే స్టేషన్‌ల మధ్య దొంగను గుర్తించి అతడిని విచారించే సమయంలో రైలు నుంచి దూకేయడంతో చనిపోయాడు.
VKB: అతివేగంగా వస్తున్న ఓ లారీ తాండూర్ పట్టణంలో బీభత్సం సృష్టించింది. ఇవాళ ఉదయం కొడంగల్ నుంచి చించోలి వైపు నాపరాతి లోడుతో తాండూరు మీదుగా వస్తున్న లారీ పట్టణంలో ఓవర్ బ్రిడ్జి దాటగానే ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అనంతరం డివైడర్ల మీదకు దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డు మీద ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
MHBD: జిల్లాలో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు సామాజిక భద్రతను అందిస్తున్నదని కలెక్టర్ స్నేహ శబరీశ్ మంగళవారం తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదా చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళలు 290 కోట్ల ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. ఈ పొదుపు కుటుంబాల అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.
MDCL: నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి జరగనుంది. ఉప్పల్, నాచారం సహా అనేక ప్రాంతాలకు ఇప్పటికే రేషన్ బియ్యం స్టాక్ వచ్చినట్లు డీలర్లు తెలిపారు. పంపిణీ ప్రక్రియలో భాగంగా మూడు నెలల కోసం మూడుసార్లు, వేలిముద్రలతో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అందరూ దీనిని గమనించాలని కోరారు.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి మంగళవారం మొత్తం రూ.2,46,462 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల ద్వారా రూ .1,34,798, ప్రసాదాల ద్వారా రూ .95,900, అన్నదానం ద్వారా రూ.15,764 వసూలైనట్లు ఆయన వెల్లడించారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
MULG: జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇప్పటివరకు రూ.133.25 కోట్ల విలువైన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ దివాకర మంగళవారం తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.
KNR: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 1, 2వ తేదీల్లో “హిందీ అనువాదంలో శిక్షణ”పై రెండు రోజుల కార్యశాల నిర్వహించనున్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ సతీశ్ కుమార్ బ్రోచర్ను ఆవిష్కరించారు. హిందీ అనువాదంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవుతుందన్నారు.
కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్ చోటు చేసుకున్న బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఐజీపీ అశోక్ కుమార్ నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఘటనకు సంబంధించి వివరాలను స్వయంగా పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
W.G: సీతారామపురంలో YSR విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను పది రోజుల్లో అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా నిందితులను పట్టుకోకపోతే, పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు.
ఖమ్మం జిల్లా ఇరిగేషన్ సీఈగా మంగళంపూడి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సీఈగా పనిచేసిన వెంకటరమేష్ బాబు మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఖమ్మం ఎస్ఈగా కొనసాగుతున్న వెంకటేశ్వర్లకు సీఈగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది.