IPL 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తన తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగుల వద్ద మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో (3.4) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (13) వెనుదిరిగాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి స్కోర్ 54/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో గిల్ (28*), జోస్ బట్లర్ (11*) ఉన్నారు.
RR: కేశంపేట మండలంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి వ్యక్తికి చేరేలా పనిచేయటం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా అంత్యోదయ కేంద్ర పథకాలపై అవగాహన కల్పించారు.
SDPT: ములుగు మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఆర్.వీ.ఎం మెడికల్ కళాశాలలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు పోలీస్ కమిషనర్ (CP) ఎస్. రష్మీ పెరుమాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు ప్రయాణంలో తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.
SRPT: ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ పోల్కమ్మకుంటలో రాత్రివేళ యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల అండతోనే వెంచర్లకు మట్టిని తరలిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన తహసీల్దార్ అమిత్ సింగ్, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఈరోజు హెచ్చరించారు.
SRCL: జనగణన- 2027లో మాస్టర్ ట్రైనర్లు కీలకమని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జనగణన 2027లో భాగంగా సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, (సీఎంఎంఎస్), డిజిటల్ విధానం, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్‌పై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుండగా, మంగళవారం కలెక్టర్ హాజరై మాట్లాడారు.
ATP: ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. సంస్థ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, విషాల్ ఫెర్రర్‌లను కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యా, ఆర్థికాభివృద్ధికి ఆర్డీటీ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు.
MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన అధ్యక్షులు హాజరయ్యారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు.
GDWL: అలంపూర్ క్షేత్రంలోని శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. గత 159 రోజులకు సంబంధించి నిర్వహించిన ఈ లెక్కింపులో రూ. 24,77,093 నగదు వచ్చిందని ఆలయ ఈవో. దీప్తి వెల్లడించారు. నగదుతో పాటు 8 యుఎస్ డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 10 కెనడా డాలర్లు కూడా భక్తులు కానుకలుగా సమర్పించారు.
KNR: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రతిబింబించేలా గ్రామసభ నిర్వహించాలని డిప్యూటీ సీఎం. భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు.
NLG: నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన యువకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్చరించారు.
MBNR: రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని మంగళవారం కలెక్టర్ కుష్బూ గుప్తా తెలిపారు. రూ.10,000 కోట్ల ఛార్జీల మైలురాయిని చేరిన సందర్భంగా మంగళవారం బస్టాండ్‌లో ఉత్సవాలు నిర్వహించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
SRD: మునిపల్లి మండలం మగ్దుంపల్లిలో జమాది ఇస్లామి హింద్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన వ్యక్తులు కలిసి నిర్వహించే ప్రోగ్రాం ఈద్ మిలావని అంటారని గ్రామ అధ్యక్షులు మగ్బూల్ అహ్మద్ తెలిపారు. ఈద్ మిలాద్ కార్యక్రమం చాలా గొప్పదని BRS రాష్ట్ర సభ్యుడు పైతర సాయికుమార్ పేర్కొన్నారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు నజిముద్దీన్ ఉన్నారు.
VSP: లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లయన్ పి.వి. చంద్రశేఖర్ తన 70వ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి మంగళవారం రూ.1 లక్ష విరాళంగా అందజేశారు. ఈ చెక్కును మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వెలగపూడి ఉమా మహేశ్వరరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ డి. సూర్య ప్రకాష్ సమక్షంలో స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
PPM: వేగంగా పనిచేయడానికి పక్కా ప్రణాళిక, ప్రాధాన్యతల గుర్తింపు అత్యవసరం ఆని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పట్ల కొందరు రెవెన్యూ అధికారుల ఉదాసీనతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు బాధ్యతపై అవగాహన ఉండాలని, ప్రతి చిన్న పనికి ఉన్నతాధికారుల నుండి పర్యవేక్షణ అవసరమని భావించడం సరికాదని అన్నారు.
AKP: మహిళ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఉన్నత పాఠశాలల్లో మహిళలకు ప్రత్యేక స్టాప్ రూములు, టాయిలెట్స్, వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వి. శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి కోరారు. ఈ మేరకు డీఈఓ అప్పారావు నాయుడికి మంగళవారం వినతి పత్రం అందజేశారు.