PDPL: ఏప్రిల్ 2న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఇవాళ ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి సందేశంతో సభను ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఇందిరమ్మ జీవిత బీమా, పాఠశాలల్లో అల్పాహారం పథకాల గురించి తెలుపాలన్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కమిషనర్‌గా దండు శ్రీను అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం చిట్యాలలో ఆయన పదవి విరమణ సన్మాన సభకు హాజరై మాట్లాడారు. ఆయన శేష జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MDK: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఏప్రిల్ 01 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీ.వీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సమయంలో అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లఘింస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
GDWL: పట్టణ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. 2026-27 సంవత్సరానికి రూ.24.84 కోట్ల ఆదాయం, రూ.27.56 కోట్ల అంచనా వ్యయంతో కూడిన బడ్జెట్‌ను అధికారులు ప్రతిపాదించారు.
WNP: ఆత్మకూర్ మండలంలోని ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ముందు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సిన వచ్చేదని, ప్రస్తుతం స్థానికంగా డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉండడం చాలా సౌకర్యంగా మారిందని రోగులకు కలెక్టర్ తెలిపారు.
IPL 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. గత సీజన్‌లో టేబుల్ టాప్ 3లో నిలిచిన ఈ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా జరగనుంది. ఇరుజట్లకు ఇది సీజన్ తొలి మ్యాచ్ కావడంతో గెలుపుతో శుభారంభం చేయాలని భావిస్తున్నాయి.
MBNR: PUలో పరీక్షలు రాసిన 45 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ నరేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం వీసీ శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఫలితాల జాప్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. దీంతో ఫలితాలను త్వరగా విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వీసీ, అధికారులతో చర్చిస్తామన్నారు.
W.G: ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెరుకువాడలో మంగళవారం యానాదుల కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, బ్రహ్మారెడ్డి, రంగప్రసాదరాజు, మహంకాళి, రాము, శివరామరాజు, తదితరులు పాల్గొన్నారు.
కడప నగరంలోని ముత్తురాస్‌పల్లి ZPHS హైస్కూల్‌ను ఎమ్మెల్యే మాధవి ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల పరిశుభ్రత లోపంపై అసహనం వ్యక్తం చేసి, వెంటనే శుభ్రత, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
VZM: జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తోటపల్లి బ్యారేజ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేసి, ప్రభుత్వ భూములను త్వరగా అప్పగించాలన్నారు.
AKP: ఎలమంచిలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో అభ్యుదయ రైతులకు నిర్వహించిన విజ్ఞాన యాత్రలో మామిడి, జీడి తోటల పెంపకం అంటుకట్టు విధానంపై అవగాహన కల్పించినట్లు ఏవో మోహన్ రావు మంగళవారం తెలిపారు. పోలవరం జిల్లా ఉద్యానవన కేంద్రంలో తాటి పండ్ల నీరాపై వ్యవసాయ శాస్త్రవేత్త ప్రవీణ్ వివరించినట్లు పేర్కొన్నారు. పామాయిల్ తోటల సాగు సస్యరక్షణ చర్యలు తెలియజేసినట్లు తెలిపారు.
KRNL: కౌతాళం గ్రామ పంచాయతీ బండిమెట్ట, కమేళ, దినసరి మార్కెట్లకు ఏప్రిల్ 2న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు MPDO గోపాల్, సర్పంచ్ దినకర్, PS యోగేశ్వర్ తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నగదు డిపాజిట్ చేసి పాల్గొనాలని సూచించారు. బండిమెట్ట రూ.1.50 లక్షలు, కమేళాకు రూ.40,000, దినసరి మార్కెట్‌కు రూ.15,000 డిపాజిట్ చెల్లించాలన్నారు.
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గ పరిధిలోని సంబేపల్లి మండలంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలకు విస్తృతంగా శిక్షణ ఇచ్చారు.సైద్ధాంతిక పునాది, కార్యపద్ధతి, కార్యవిస్తరణపై వివరించారు.
VSP: వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ 2026 సీజన్-6 బ్రోచర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాకారుల ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు.
ASR: అనంతగిరి మండలం జామగూడ వాసుల 78 ఏళ్ల కల నెరవేరింది. మార్దగూడ జంక్షన్ నుంచి కమలాపురం మీదుగా జామగూడ వరకు 3 కి.మీ. బీటీ రోడ్డుకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ డా.సియ్యారి దొన్ను దొర శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షలతో ఈ పనులు చేపడుతున్నారు. ‘అడవి తల్లి బాట’ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు.