• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పసి పిల్లల క్రయవిక్రయాలపై కఠిన చర్యలు: బీజేపీ

KDP: చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 25 రోజుల పసికందును కన్నతండ్రే రూ.50 వేలకు అమ్మడం, దానికి సిబ్బంది మధ్యవర్తులుగా ఉండటం దారుణమని BJP మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. భరోసా కల్పించాల్సిన వైద్యులే ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇలాగైతే ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు.

April 3, 2026 / 12:46 PM IST

లబ్ధి దారుడి ఇంట్లో సహపంక్తి భోజనం

NLG: మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు. సన్నబియ్యం పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా లబ్ధిదారుడి ఇంట్లో వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రజా ప్రభుత్వానికి లబ్ధిపొందిన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

April 3, 2026 / 12:46 PM IST

విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

PDPL: మైనారిటీ నిరుద్యోగ యువతకు TOMCOMతో సంయుక్తంగా విదేశీ ఉద్యోగాలు అందజేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, పెద్దపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియా, జర్మనీ, ఖతార్, ఒమన్, గ్రీస్ వంటి దేశాల్లో వివిధ వృత్తులలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని, అర్హత గలవారు సంప్రదించాలని కోరారు.

April 3, 2026 / 12:46 PM IST

కష్టపడే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు: ఎర్రబెల్లి స్వర్ణ

WGL: కష్టపడే ప్రతి ఒక్కరికి తన కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. సంగెం మండలంలోని రామచంద్రపురం గ్రామ కాంగ్రెస్ నేతలు స్వర్ణతో భేటీ అయ్యారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్తూ రాబోయే అన్ని ఎన్నికలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

April 3, 2026 / 12:45 PM IST

టీఆర్పీ బలోపేతం గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు

MLG: ములుగు పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి గ్రామస్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు గట్ల రాజన్న ఇవాళ తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా సేవలో అంకితభావం ఉన్న యువత పార్టీతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

April 3, 2026 / 12:44 PM IST

జిల్లాలో తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

W.G: నవ్యాంధ్రకి అమరావతి రాజధానిగా ప్రభుత్వం ప్రకటించడంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇవాళ ఉదయం తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన రైతులు, టీడీపీ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

April 3, 2026 / 12:43 PM IST

అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సర్పంచ్

BHPL: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని మహదేవ్పూర్ మండలం ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ తెలిపారు. ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఇవాళ గ్రామ సభ జరిగింది. సర్పంచ్ సభలో పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయి సమస్యలకు పరిష్కారం అయ్యేందుకు ఈ సభలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.

April 3, 2026 / 12:43 PM IST

ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులుగా గోగర్ల రాజేశం

MNCL: తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా గోగర్ల రాజేశం నియామకం అయ్యారు. బెల్లంపల్లి మండలం కన్నాలకు చెందిన రాజేశంకు శుక్రవారం TUV రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వ హామీలను ఉద్యమాకారులకు అమలు చేసేంత వరకు పోరాడాలన్నారు.

April 3, 2026 / 12:42 PM IST

ఏసుక్రీస్తు త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే

W.G: ఏసుక్రీస్తు త్యాగానికి, ప్రేమకు, కరుణకు ప్రతీక గుడ్ ఫ్రైడే అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే అంజిబాబు గుడ్ ప్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.

April 3, 2026 / 12:41 PM IST

బాధితులను పరామర్శించిన యువనేత

SKLM: పోలాకి మండలం వనితమండలం గ్రామంలో మండల కార్యవర్గ సభ్యులు సోమరాజు పాపారావు మనమరాలను యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య శుక్రవారం పరామర్శించారు. ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, మండల ఉప అధ్యక్షులు రావాడ అప్పన్నరాజు, సర్పంచ్ ఎన్ని వెంకటేష్, మాజీ ఎంపిటిసి కంచు రమణ, మండల యూత్ ప్రధాన కార్యదర్శి చిట్టి రవి తదితరులు పాల్గొన్నారు.

April 3, 2026 / 12:40 PM IST

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు

టెక్ దిగ్గజం యాపిల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1,49,900 విలువైన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను రూ.1,02,900కే కొనుగోలు చేయొచ్చు. ఇన్‌స్టంట్ డిస్కౌంట్, HDFC కార్డులపై లభించే క్యాష్‌బ్యాక్, పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై ఇచ్చే బోనస్ వంటివన్నీ కలిపి ఈ తగ్గింపును అందిస్తున్నట్లు ఇమేజిన్ స్టోర్ తెలిపింది. ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే.

April 3, 2026 / 12:40 PM IST

వివాహిత ఆత్మహత్య

TPT: గూడూరులో గురువారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో దేశాయిశెట్టి వీణ జెస్సీ, వంశీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తతో గురువారం గొడవ జరిగింది. ఈక్రమంలో ఆమె మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి నిర్మల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

April 3, 2026 / 12:39 PM IST

వివాహిత ఆత్మహత్య

TPT: గూడూరులో గురువారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో దేశాయిశెట్టి వీణ జెస్సీ, వంశీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తతో గురువారం గొడవ జరిగింది. ఈక్రమంలో ఆమె మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి నిర్మల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

April 3, 2026 / 12:39 PM IST

వివాహిత ఆత్మహత్య

TPT: గూడూరులో గురువారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో దేశాయిశెట్టి వీణ జెస్సీ, వంశీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తతో గురువారం గొడవ జరిగింది. ఈక్రమంలో ఆమె మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి నిర్మల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

April 3, 2026 / 12:39 PM IST

రేపు మోకాళ్ళ నొప్పుల సమస్యలకు ఉచిత వైద్య శిబిరం

KDP: తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు మోకాళ్ల నొప్పుల నివారణకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సుభాషిణి తెలిపారు. ఈ శిబిరంలో ప్రఖ్యాత రోబోటిక్ మోకాలి కీలు మార్పిడి నిపుణులు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి వైద్య సేవలు అందిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుభాషిణి చెప్పారు.

April 3, 2026 / 12:39 PM IST