ELR: ద్వారకతిరుమల శ్రీవారి దర్శనం నకిలీ టికెట్ల వ్యవహారంలో గురువారం ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దేవస్థానం అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇతరుల సహాయంతో నకిలీ సాఫ్ట్‌వేర్ రూపొందించి టికెట్లను తయారుచేసి కౌంటర్లో విక్రయించారన్నారు. దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసామన్నారు.
KDP: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె సుందరయ్య కాలనీలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ కాలనీవాసులు గురువారం పంచాయతీ కార్యదర్శి నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. భూపోరాటం ద్వారా నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ASR: చిన్నారుల ఎదుగుదలకు పోషకారం, సరైన సంరక్షణ, ప్రేమతో కూడిన వాతావరణం కల్పించాలని కలెక్టర్ టీ.నిశాంతి అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8వ పోషణ పక్షోత్సవం గోడ పత్రికను గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈనెల 23వరకు పోషణ పక్షోత్సవం పక్కాగా నిర్వహించాలన్నారు. మాతా శిశు పోషణ, ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కార్యక్రమం అమలు చేయాలన్నారు.
పుదుచ్చేరి, అసోం, కేరళంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు అసోంలో 75.91 శాతం, కేరళంలో 62.71 శాతం, పుదుచ్చేరిలో 72.40 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుందని చెప్పారు.
GDWL: కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం గద్వాలలోని ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలలను సందర్శించి, అక్కడి వసతులను సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న శిక్షణ ప్రమాణాలు, హాస్టల్ సౌకర్యాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించారు.
NRPT: వరి కోతల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మాగనూర్ మండలంలోని పలు గ్రామాల్లో గత 15 రోజులుగా కోతలు కొనసాగుతున్నాయి. కేంద్రాలు లేక రైతులు ధాన్యాన్ని కర్ణాటక మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు.
AKP: భూములు స్వాధీనానికి వ్యతిరేకంగా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 65వ రోజుకు చేరుకున్నాయి. సీపీఎం నాయకులు దేవుడు నాయుడు, సోమనాయుడు, శివాజీ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా భూములను తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆపాలన్నారు.
TG: కాంగ్రెస్, BRS పార్టీలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ కవిత చేసే కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు సీఎం రేవంత్ రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల పూర్తి మద్దతుతో బీజేపీ బలోపేతం అవుతోందని ధీమా వ్యక్తం చేశారు.
కోనసీమ: కూటమి ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సుమారు 249 మంది లబ్ధిదారులకు పాసుపుస్తకాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
NLR: కందుకూరులోని కోటారెడ్డి నర్సింగ్ హోమ్‌లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు NTR వైద్య సేవలను ప్రారంభించారు. మూడు తరాలుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న కోటారెడ్డి కుటుంబాన్ని ఆయన అభినందించారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటికే 1200 మందికి రూ. 10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ATP: జిల్లాలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ‘స్త్రీరక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 11,054 ఇళ్లల్లో పోలీసులు సర్వే పూర్తి చేశారు. కుటుంబ కలహాలు, గృహ హింస వంటి 100 సమస్యలను గుర్తించి పరిష్కారానికి ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించారు.
SRPT: కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 444 మంది లబ్దిదారులకు రూ 1.38 కోట్ల విలువ CMRF చెక్కులను ఈ రోజు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదవారికి అవసరమైన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు.
NRML: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేద సొంతింటి కల సకారం అవుతుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మన్ పడిగల భూషణ్ అన్నారు. కడెం మండలంలోని చిన్నబెల్లాల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పన్నాల లావణ్య కు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి వారు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీత, సర్పంచ్ బొంతల లక్ష్మి ,ఉపసర్పంచ్ అనూశ ఉన్నారు.
MLG: యాసంగి సీజన్‌లో రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రారంభించారు. తూకం, రవాణ, మద్దతు ధర సమస్యలకు తక్షణ పరిష్కారం అందిస్తామని తెలిపారు. ప్రతి గింజను కొనుగోలు చేసేలా పూర్తి ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో రైతులకు సేవలందించాలన్నారు.
తమిళ హీరో అజిత్ కుమార్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబోలో ‘AK64’ మూవీ రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ మే మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తన ప్యాషన్స్ అయిన సినిమా, రేసింగ్‌లను బ్యాలెన్స్ చేసేందుకు అజిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడట. నెలలో 15 రోజులు షూటింగ్‌కు, మిగిలిన 15 రోజులు రేసింగ్‌కు కేటాయించనున్నాడట.