WGL: వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన మాజీ MPP రాజిడి అశోక్ రెడ్డి తండ్రి రాజిడి ఇంద్రసేవరెడ్డి అనారోగ్యంతో నిన్న మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న MLA KR నాగరాజు ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.
SRD: పటాన్ చెరు మండలం భానూరు పరిధిలోని కంచర్ల గూడెంలో ఆదివారం జరిగిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి–చిత్తారమ్మ కళ్యాణ మహోత్సవం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామీణ జాతరలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడతాయని నిర్వాహకులు తెలిపారు.
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో దారుణం చోటుచేసుకుంది. మనీషా అనే వివాహితను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. మూడు నెలల క్రితం మనీషా-తవీర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు జీవనోపాధి కోసం ఒడిశా నుంచి వచ్చారు. వీరు ఓ ఇటుక బట్టిలో పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NLR: నెల్లూరులో MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు బాల వివాహ ముక్త్ ప్రచార రథాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహాలు చేయడం నేరమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఆదివారం రూ.42,96,548 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.15,33,890, VIP దర్శనాలతో రూ.7,20,000, కార్ పార్కింగ్తో రూ.6,11,000, బ్రేక్ దర్శనాలతో రూ.3,72,000, ప్రధాన బుకింగ్లతో రూ.2,28,600, వ్రతాలు రూ.2,16,000 కళ్యాణకట్ట రూ.1,10,000 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది
NDL: నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి బాధిత నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
KKD: కాజులూరు మండలంలో గ్రామీణ రవాణా సౌకర్యాల మెరుగుదలకు రూ.1.43 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు సిమెంట్ రోడ్లకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాలకు మెరుగైన రహదారులు అందించడమే లక్ష్యం అన్నారు.
KNR: ప్రవాస భారతీయులు అందోళన చెందవద్దని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ఇజ్రాయిల్- ఇరాన్ యుద్దం నేపథ్యంలో గల్ఫ్ దేశాలైన దుబాయి, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తూ ఆందోళన చెందుతున్న ప్రవాస భారతీయులు ఇకపై ఆందోళన చెందనక్కర్లేదన్నారు.
BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని ఆయన తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కామ దహన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ప్రజా పూజ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం త్రి రాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు కామ దహనం నిర్వహించారు.
TG: గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మస్కట్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చేందుకు అవకాశం కల్పించేది. రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరుకుని.. భారత్కు తిరిగి రావొచ్చని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రవాస భారతీయులు ఆందోళన చెందొద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
HNK: కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్, తనతో పాటు మరో 15 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో ఆదివారం ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. వికాస్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సంఘటనతో పలువురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు.
PDPL: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, సుల్తానాబాద్ మున్సిపాల్టీ పరిధి రెండో వార్డు కౌన్సిలర్ గాజుల రాజమల్లు పేర్కొన్నారు. రెండో వార్డు పరిధిలోని పలువురు ఇందిరమ్మ లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి సకాలంలో బిల్లులు పొందాలని లబ్ధిదారులకు సూచించారు.
NLG: మిర్యాలగూడ మండలం, గూడూరులో ఆదివారం ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ఒరిస్సాకు చెందిన మనీషా తారు, తవీర్ మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవనోపాధి కోసం గూడూరులోని ఇటుక బట్టీలో పనికి చేరిన ఈ దంపతుల మధ్య గొడవ జరగడంతో, తవీర్ భార్యను చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
KDP: కేతు గ్రహ చంద్రగ్రహణం పురస్కరించుకుని అగస్త్యేశ్వరాలయం తలుపులు మూసి వేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి, బుధవారం ఉదయం 6 గంటల వరకు ఆలయంలో దర్శనాలు ఉండవని, గ్రహణం పుబ్బ నక్షత్రంలో సంభవిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రహణ సమయంలో సింహరాశి వారు గ్రహణాన్ని చూడకూడదని పండితులు సూచించారు.