BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ ఛైర్మన్ NSR ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక అభిషేకంతో వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
CTR: పుంగనూరు మండలం పట్రపల్లి గ్రామ సమీపంలో అల్లనేరేడు తోటలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 1,50,000 డ్రిప్ పైపులు, కేబుల్స్ కాలిపోయి నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు.
T20 WC చరిత్రలో ఆసియా జట్లు లేకుండా ఇప్పటివరకు సెమీఫైనల్స్ జరగలేదు. దాదాపు ప్రతి ఎడిషన్‌లోనూ రెండు ఆసియా జట్లు సెమీస్‌కు (2016, 2021ల్లో ఒక్కో జట్టు మాత్రమే) చేరుకున్నాయి. అయితే, ఈసారి సెమీస్ చేరుకోవడానికి భారత్, పాక్, శ్రీలంక తడబడుతున్నాయి. ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం SA, WI, NZలతో ఆసియా జట్లకు భారీ పోటీ నెలకొంది.
NLR: మహిళలు పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం- 2013 మరింత పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం నెల్లూరు తిక్కన ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 10 మంది పైన మహిళా ఉద్యోగులు పని చేస్తున్న చోట ఐ.సి.సి ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
VZM: ఈనెల 28వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చీపురుపల్లి మండలం రావివలస వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రానున్వారు. ఈ నేపథ్యంలో బుధవారం సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పరిశీలించి, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేదిక నిర్మాణం, పార్కింగ్ స్థలాలు, తాగునీరు తదితర ఏర్పాట్లను సమీక్షించారు.
KRNL: జనసేన కార్యకర్తలను సాధకులుగా పిలవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు బుధవారం ఆదోని నియోజకవర్గం ఇంఛార్జ్ మల్లప్ప తెలిపారు. ఇప్పటికే 75 మంది సాధకులను నియమించామని, సభ్యత్వం తీసుకున్న వారందరికీ భీమా రక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు. మార్పు కోసం యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
AP: శాసనమండలిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మహిళలకు రూ.1500 ఇచ్చే స్త్రీ నిధి పథకం ఏమైందని వైసీపీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా MLC వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఏమయ్యాయని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిస్తూ.. సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఒక్కొక్కటిగా అన్ని హామీలు అమలు చేస్తామన్నారు.
HYD: నగరంలో వాతావరణం మారిపోయింది. బుధవారం ఉదయం భానుడు ప్రతాపం చూపినప్పటికీ మధ్యాహ్నానికి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరానికి వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఉష్ణోగ్రత 29°Cగా నమోదైనట్లు తెలిపింది. సాయంత్రం వేళ వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది.
ADB: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని MLA అనిల్ జాదవ్ కోరారు. గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన బోగ్ బండార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్థానికులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
TPT: నాయుడుపేట, దొరవారిసత్రం రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న తిరుచ్చి టికెట్ ఆధారంగా ఆమెది తమిళనాడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MNCL: లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం, వెంకట్రావుపేట, చందారం గ్రామాలలో రెండో తరగతి విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ అసైన్మెంట్ సర్వేను నిర్వహించారు. బుధవారం ఫీల్డ్ విజిటర్లు ఆయా గ్రామాలలో పర్యటించి సర్వేను చేపట్టారు. కార్యక్రమంలో వెంకట్రావుపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయురాలు శ్రీదేవి, సిఆర్పి విద్య, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు ఉన్నారు.
VZM: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు బుధవారం స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్. ఎం. వెంకటేశ్వరరావు హాజరై పోటీలను ప్రారంభించారు. వైకల్యం శరీరానికే తప్పా సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని అన్నారు.
PDPL: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మొదటి రోజు పరీక్షకు 97 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. మొత్తం 5419 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 5271 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. 148 మంది గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
VKB: ఏకమామిడి గ్రామ రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కంకర తేలిన రోడ్డుపై వాహనాలు వెళ్లే సమయంలో విపరీతమైన దుమ్ము లేస్తోంది. దీనివల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవ్వడమే కాకుండా స్థానికులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలమయమైన ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
VKB: తాండూరులో ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఇవాళ 2,553 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 57 మంది గైర్హాజరైనట్లు కస్టోడియన్లు మల్లినాథప్ప, కృష్ణయ్య తెలిపారు. మిగతా 2,496 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. జనరల్ విభాగంలో 1,969 మందిలో 33 మంది గైర్హాజరుతో 1,936 మంది పరీక్షలు రాశారు.