GNTR: కొత్తపేట పోలీసులు తెల్లవారుజామునే వెంకటాద్రి పేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 54 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజలతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో ఆయన వివరించారు.
PLD: ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ భేటీలో, వారు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో అందిన ప్రజా దరఖాస్తుల స్థితిగతులపై రూపొందించిన సమగ్ర నివేదికలను మంత్రి లోకేశ్ వారికి అందజేశారు.
VZM: కొత్తవలసలోని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ దుకాణదారుడు తన ఇల్లు, షాపులు తనఖా పెట్టి ఎస్.బి.ఐ నుంచి రూ 36 లక్షలు 2019లో రుణం తీసుకొన్నారు. బ్యాంకు కట్టవలసిన వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో గురువారం రికవరీ బృందం వచ్చి షాపులు, గృహానికి తాళాలు వేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో, చీఫ్ మేనేజర్, పోలీసులు పాల్గొన్నారు.
HYD: నగరంలో గాలి నాణ్యతలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం తగలబెట్టడం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటోంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం వట్టినాగులపల్లిలో 234గా రికార్డ్ అయింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
NDL: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని శిఖరేశ్వరం సమీపంలో శుక్రవారం ఉదయం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం నుంచి బాధితులను శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
KMM: సత్తుపల్లి సైబర్ నేరం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాధితుడి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో గతంలోనే 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, తాజాగా పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితులను ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు కలిగి, అమాయకుల ఖాతాల ద్వారా భారీగా నిధులు మళ్లించిన ఈ ముఠాపై దర్యాప్తు కొనసాగుతుంది.
KNR: హుజురాబాద్ మండలం సింగాపురంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ శంకర్ ఆధ్వర్యంలో గురువారం రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ గౌస్ ఆలం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచనలు సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సీఐ కరుణాకర్, MVI వేణు, అధ్యాపకులు పాల్గొన్నారు.
MNCL: మంచిర్యాల స్థానిక ప్రభుత్వ ITIలో PMKVY 4.0 కింద పలు కోర్సుల్లో నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITI ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. CNC ఆపరేటర్ (టర్నింగ్), ఎలక్ట్రికల్ వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో 3నెలలు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు అన్నారు. మార్చ్ 3లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NRML: జిల్లాలో గిరిజనుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్‌లో గురువారం రాత్రి నిర్వహించిన సమావేశంలో వివరించారు. కమిషన్ సూచనల మేరకు గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి, పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఇందులో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తుదితులు పాల్గొన్నారు.
NTR: తిరువూరు లైన్ బజారు ప్రాంతంలో అల్లాహ్ దైవ సేవకురాలు అబిదా ఖాతూన్ నివాసంలో రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అబిదా ముస్లిం పేద మహిళలకు రంజాన్ తోఫాలను మహిళలకు అందజేశారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.
MLG: ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. గ్రామ సమస్యలను త్వరగా పరిష్కరించి శుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఆదాయాభివృద్ధిపై దృష్టి పెట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. 5 రోజుల శిక్షణ పొందిన సర్పంచులకు సర్టిఫికెట్లు అందజేశారు.
ADB: ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధిపై దృష్టి సారించడం జరుగుతోందని జిల్లా ఉప విద్యాధికారి గోడం చందన్ అన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన విద్యాశాఖ ఉప విద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టారు. పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు శుక్రవారం రావులపాలెం మండలం ఈతకోట వాస్తవ్యులు కలిదిండి సాయి మణికంఠ కుటుంబ సభ్యులు రూ.50,000 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం అందజేశారు.
కృష్ణా: బాపులపాడు(M) వీరవల్లిలోని శ్రీ తిరుపతమ్మ, గోపయ్యగార్ల తిరునాళ్లు శుక్రవారం మొదలు కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు అమ్మవారి కల్యాణం జరగనుంది. సాయంత్రం మేళతాళాలు, కోలాటాలు, చెక్కభజనలతో గ్రామ ప్రభల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది.
సత్యసాయి: RDT సంస్థను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సీ జన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దాసగానపల్లి కుల్లాయప్ప పేర్కొన్నారు. బత్తలపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ సాకే వినయ్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కుళ్లాయప్పతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ సంస్థ పేదలకు అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు.