RR: మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని గచ్చిబౌలి ఏఈ భాస్కర్ తెలిపారు. నానక్ రాంగూడ, అలేఖ్య హోమ్స్, విజయకృష్ణ బిల్డింగ్, డోమినోస్ ఏరియా, గోల్ఫ్ వ్యూ, ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
BHPL: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరణ తప్పనిసరిగా పెట్టుకోవాలని MLA గండ్ర స్పష్టం చేశారు. గణపురం పోలీస్ స్టేషన్‌లో చక్రవర్తి హాస్పిటల్, శ్రీకాంత్ మిత్ర బృందం, జర్నలిస్టుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో MLA హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే సీజ్ చేయాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో SP పాల్గొన్నారు.
TG: కళ్లెదురుగా కనిపించే సూర్యభగవానుణ్ణి ప్రత్యక్షనారాయణుడంటూ ఆరాధిస్తాం. ఆయన తూర్పున ఉదయిస్తాడు కనుక పూజామందిరంలో తూర్పు ముఖంగా కూర్చుని పూజించటం శ్రేష్ఠమని పౌరాణిక గ్రంథాలు సూచిస్తున్నాయి. దేవుడి పటాలు, విగ్రహాలు ఏ ముఖంగా ఉన్నా.. పూజ చేసే వ్యక్తి మాత్రం తూర్పు ముఖంగా కూర్చోవాలి. అలా అవకాశం లేదనుకుంటే.. ఇతర దిక్కులు ఫరవాలేదు కానీ దక్షిణ ముఖంగా మాత్రం పూజించకూడదు.
NLG: రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్లో ఆరవ తరగతిలో మొత్తం సీట్లు, 7-10వ తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశాల దరఖాస్తుకు నేడు చివరి తేదీ. ఇంగ్లీష్ మీడియంలో విద్య బోధన ఉంటుంది. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్ కావున ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కోరారు.
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం గన్నవరం ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన 18–35 ఏళ్ల యువత అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన వారికి వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు naipunyam.ap.gov.inలో నమోదు కావాలని సూచించారు.
W.G: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత 2 రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానంపై దిశానిర్దేశం చేశారు.
వనపర్తి జిల్లాలో కేంద్రం ప్రభుత్వం నిర్ణయంతో 15 ఏళ్లలోపు బాలికలకు HPV టీకా అందుబాటులో ఉంటుంది. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణనిస్తుంది. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధా మాట్లాడుతూ.. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NZB: రుద్రూర్ మండల పరిధిలోని ఆహార సాంకేతిక కళాశాల వద్ద శుక్రవారం రాత్రి అక్బర్ నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మొరం కుప్పను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్బర్ నగర్ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
విజయ్ దేవరకొండ, రష్మిక తమ వివాహంపై ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు రికార్డు సృష్టించాయి. పోస్టు చేసిన 24 గంటల్లోపు 33 మిలియన్స్ సాధించాయి. గతంలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా పెళ్లి ఫొటోలకు 23.45 మిలియన్స్ లైక్స్ రాగా ఆ రికార్డు బ్రేకయ్యింది. ప్రస్తుతం ‘VIROSH’ పెళ్లి ఫొటోలు SMలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ జంట MAR 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ చేసుకోనుంది.
NLR: యూపీఎస్సీ పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.
E.G: మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి చేరుకోనున్నారు. అనంతరం 10:30 గంటలకు నగరంలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అలాగే, 11:30 గంటలకు రాజమండ్రి నుంచి కాకినాడకు బయలుదేరి వెళ్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
KMM: ప్రజలకు లబ్ది చేకూరేలా కేంద్ర ప్రాయోజిత పథకాలను జిల్లాలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలనీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా వచ్చిన వికసిత్ భారత్ జి రామ్ జి పథకం మార్గదర్శకాలు పాటించాలన్నారు.
NTR: విజయవాడ ఎన్టీఆర్ అడ్మిన్ భవన్ ఎరైవల్ బ్లాక్ 4వ ఫ్లోర్ లో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయాన్ని ఎంపీ కేసినేని చిన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ బాలకోటయ్యను, డైరెక్టర్లను ఎంపీ అభినందించారు. ప్రజా సేవకుడు పోతుల బాలయ్య ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
VZM: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం 11.10 గంటలకు రావివలస హెలిప్యాడ్‌కు చేరుకుని చీపురుపల్లి CHCలో HPV వాక్సిన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరవుతారు. పైలపేటలో NTR భరోసా పింఛన్లు పంపిణీ చేసి, మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరానికి తిరుగు ప్రయాణమవుతారు.
AP: శ్రీకాకుళం, విజయనగరంలో డయేరియా విజృంభిస్తుంది. పలు గ్రామాల్లో డయేరియా విస్తరిస్తుంది. కలుషిత నీరు తాగి ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతుంది.