చిత్తూరు: పుంగనూరు పట్టణంలోని శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారి మూలవర్లను పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత పసుపు, కుంకుమ, కాటుకతో అమ్మవారిని నిజరూపంలో అలంకరించారు.
ELR: గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ధ్వజస్తంభం పునః ప్రతిష్ట సందర్భంగా మంగళవారం క్రొవ్విడి వంశీలు ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
KMM: ఖమ్మం వెలుగుమట్ల పరిధిలో ఉన్న 60 ఎకరాల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న సుమారు 600 పేద కుటుంబాలపై వేలాది మంది పోలీసులతో దాడి చేసిన ఘటనపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీల సహాయంతో గుడిసెలను కూల్చివేయడం అమానుషం, అతిక్రూరంగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని అన్నారు.
కోనసీమ: రాజోలు నియోజకవర్గం వైసీపీ పార్టీ కొత్త కో ఆర్డినేటర్‌ను నియమించనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత కో ఆర్డినేటర్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు అనారోగ్యం కారణంగా తీసుకుంటున్న సందర్భంలో ఈ మార్పు అనివార్యమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటున్నారు.
AP: తిరుమల శ్రీవారికి ప్రతి ఒక్కరూ తమ కష్టాన్ని చెప్పుకుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. YCP హయాంలో దేవాలయాలపై దాడులు చేశారని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని గుర్తుచేశారు. రాముడి విగ్రహం తలతీశారని ప్రశ్నిస్తే కూడా కేసు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరుమల ప్రక్షాళనకు ఈవోను నియమించామని తెలిపారు. వెంకన్నను ప్రార్థించడం వల్లే ఇన్నేళ్లుగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.
SRPT: మోతె మండల కేంద్రంలో పొదుపు సంఘం (VOA) భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దోసపాటి అనురాధ, ఉప సర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భవన నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల కార్యకలాపాలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు.
చిత్తూరు: పలమనేరులో వెంకట్రావు అనే వ్యక్తి సుమారు రూ.14 కోట్లకు ఐపీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బాధితులు అంతా కలిసి పలమనేరు సీఐ మోహన్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సీఐ ఇలాంటి అనధికారిక చీటీలు వేయవద్దని ప్రజలకు సూచించారు.
CTR: పుంగనూరులోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు MPDO అప్పాజీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య రాకుండా రూ.25 లక్షలతో వివిధ గ్రామాల్లో బోర్లు వేస్తున్నట్లు చెప్పారు. మండల పరిధిలో 624 బోర్లు ఉన్నాయని అన్ని పనిచేస్తున్నాయన్నారు. నీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
MDCL: బాచుపల్లిలో దోమల బెడద రోజు రోజుకీ పెరుగుతోంది. సాయంత్రం అయ్యే సరికి కాలనీల్లో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. చెరువులు, నిల్వ నీరు, శుభ్రం చేయని డ్రైన్లు సమస్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. డెంగ్యూ భయంతో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే ఫాగింగ్ చేపట్టి పరిసరాల శుభ్రత పై చర్యలు తీసుకోవాలి.
MDK: రైతుల పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం ముందస్తుగా సాగునీరు విడుదల చేసిందని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ముందస్తుగా సాగునీరు విడుదల చేసిందని తెలిపారు.
BHNG: జిల్లాలో రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కె.నరసింహ ఈరోజు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందని, పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, మొబైల్ ఫోన్లు నిషిద్ధమని స్పష్టం చేశారు.
MNCL: బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటిపన్ను బకాయిలు ఉన్నవారు ముందస్తుగా చెల్లిస్తే వడ్డీ నుంచి ఉపశమనం పొందవచ్చునన్నారు. కావున బకాయిలు ఉన్నవారు సకాలములో బిల్ కలెక్టర్లకు గాని,ఆఫీస్ కౌంటర్లో గాని చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
VKB: తాండూర్ నుంచి హైదరాబాద్‌కు 110 కిలోమీటర్లు బస్సు ఛార్జ్ రూ.160 అదే రైలు ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ రూ. 55 ఉంది. బస్సులో వెళ్లే వారికి తీవ్రంగా కాలయాపన జరుగుతుండగా అదే రైల్లో వెళ్లే వారికి అతి తక్కువ సమయంలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. రైలు ఛార్జ్ కేవలం రూ. 55 ఉండి ఉండగా బస్సు ఛార్జీ రూ.160 ఉండటంతో ఉన్నతాధికారులు ఆలోచించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సలహాదారులు రత్నం విచ్చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ స్వయంగా వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం ఆయనకు అందజేశారు.
W.G: ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో వరుస అవినీతి ఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులు ACBకి చిక్కడం సంచలనంగా మారింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పట్టుబడిన 48 గంటల్లోనే, భీమవరంలో అటవీశాఖ అధికారి లంచం తీసుకుంటూ దొరకడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.