KDP: బైక్ దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్టేషన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోవెలకుంట రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న వ్యక్తులను పట్టుకుని విచారించామన్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
MNCL: ఈ నెల 27న హైదారాబాద్‌లో జరిగే కమ్యూనిష్టు పార్టీ వందేళ్ల సభ పోస్టర్లను మంగళవారం శ్రీరాంపూర్‌లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కోల్ బెల్ట్ కార్యదర్శి బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన భూమి, భుక్తి, దేశ విముక్తి 1946- 51 వరకు తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిష్టు పార్టీ సాయుధ పోరాటం సాగించిందని తెలిపారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో BRS కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి మెమరాండం అందజేశారు. వార్డులలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటుతో, మంచినీటి ఇంటర్ కనెక్షన్లు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ పేర్కొన్నారు.
JGL: నూతన పాలకవర్గం ప్రజలు ఇచ్చిన అధికారంతో ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయవద్దని, నాయకులుగా కాకండా సేవకులుగా పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ధర్మపురి మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 15 వార్డుల్లో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్నారు.
RR: న్యాయవాద రక్షణ చట్టం అమలు కోసం ఆలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రకు చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. న్యాయవాదులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయాలనే దృఢ సంకల్పంతో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ క్రమంలోనే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అభ్యర్థుల వివరాలను బోర్డు విడుదల చేసింది. ఈనెల 28 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు విధించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనుంది.
తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో నిన్న రింకూ సింగ్ నోయిడాకు వెళ్లాడు. దీంతో అతడు రేపటి జింబాబ్వే మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. అయితే, రేపటి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో రింకూ కీలకమని జట్టు యాజమాన్యం భావిస్తుంది. ఈ క్రమంలో అతడు చెన్నై చేరుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీంతో అతడు చెన్నైకి బయల్దేరినట్లు తెలుస్తోంది.
NLG: మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. దూరం, సమీప, కలర్ విజన్, కంటి ఒత్తిడి పరీక్షలు నిర్వహించి, నైట్ విజన్ సమస్యలపై సూచనలు చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ..“డ్రైవర్‌కు కంటి చూపు స్పష్టంగా ఉండకపోతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు.
NZB: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వండి పెట్టాలని వర్ని మండలం పైడిమల్ సర్పంచ్ అనూష చిరంజీవి సూచించారు. బుధవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రోజువారీగా విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలని సూచించారు.
BDK: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం మేడారం సమ్మక్క సారలమ్మల ను దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, లతోపాటు కౌన్సిలర్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మల దయతో రాష్ట్రం సభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం 45వ డివిజన్ నారాయణ స్కూల్ విద్యార్థులకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గోపాల్ రావు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుండి విద్యార్థులు తడి-పొడి చెత్తపై, ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కలిగి ఉండాలని ఉన్నారు. వ్యర్ధాలను వేరే వేరే రంగుల డబ్బాలలో వేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
BPT: వేమూరు స్పెషల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు వినయ్ రాజు బుధవారం డిమాండ్ చేశారు. రూ.70 వేల పశువులను రూ.1.25 లక్షలకు కొనాలని డ్వాక్రా మహిళలపై ఆయన ఒత్తిడి తెస్తున్నారన్నారు. నిర్దిష్ట వ్యక్తుల వద్దే కొనాలని షరతులు పెట్టడం దారుణమన్నారు. దీనివల్ల పేదలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
PLD: సత్తెనపల్లి సుగాలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేశ్ ముచ్చటించారు. పిల్లలే రాష్ట్ర భవిత అని, చరిత సృష్టించేది మీరేనని ఆయన అన్నారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూనే మాతృభాష తెలుగును మరవొద్దని సూచించారు. విదేశాల్లో చదవడం వల్ల మొదట్లో తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు. స్కూల్లో భోజనం, బోధన గురించి అడిగి తెలుసుకున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగనుంది. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘Virosh Premier League’ (VPL) పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్, పూల్ వాలీబాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ పాప్‌కార్న్ బకెట్ ఫొటో, రష్మిక గ్రౌండ్ ఫొటోలతో ఈ జంట తమ పెళ్లి సందడిని అభిమానులతో పంచుకున్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హైకోర్టుకు హాజరయ్యారు. గ్రూప్-1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్టులలోకి మార్చాలని గతంలో కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఆ ఆదేశాలు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.