BDK: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి నిత్య కళ్యాణ వేడుక సోమవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవలతో ప్రారంభమైన పూజలు అనంతరం ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య బేడ మండపానికి తీసుకువచ్చి, విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, కంకణధారణ వంటి శాస్త్రోక్త కార్యక్రమాల అనంతరం అర్చకులు నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు.
SRPT: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకు మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం ఆయన నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ కు వచ్చే మహిళ రైతులకు ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
MDCL: కీసరగుట్ట శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వారిని ఆదివారం యాంకర్ కనకాల సుమ రాజీవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ పూజారులు రవి శర్మ, రమేశ శర్మ, ప్రణీత్ శర్మ ఆశీర్వదించి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కుమారుడు తటాకం అభిలాష్ శర్మ ఉన్నారు.
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ కళాశాల భూముల అంశంపై రెఫరెండం సమర్పించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి పూర్తి నివేదిక విడుదల చేయాలని కలెక్టర్‌ను ఆయన కోరారు.
SKLM: మందస మండలంలో సాగునీటి ప్రాజెక్టుల పై అసెంబ్లీలో సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. కళింగదల్, డబార్శింగి, దామోదర సాగర్ ప్రాజెక్టులను ఎన్టీఆర్ సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ తీసుకొచ్చారన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 11 వేల 500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులకు మరమ్మతులు అవసరం ఉందన్నారు.
MDK: టైర్ల నుంచి ఆయిల్, పౌడర్ తయారు చేసే పరిశ్రమను గ్రామంలో ఏర్పాటు చేయవద్దని కోరుతూ చిన్న శంకరంపేట (M) కామారం గ్రామస్థులు అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ సుజాత సుధాకర్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామ శివారులో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల వెలువడే కాలుష్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
BHNG: కన్నతల్లిలా చూసుకోవాల్సిన కోడళ్లు తనను అనాథను చేశారని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వయసు మళ్ళిన కాలంలో అండగా ఉండాల్సిన వారే గడప దాటించడంతో, 81 ఏళ్ల వృద్ధురాలు న్యాయం కోసం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. సోమవారం భువనగిరి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆమె జిల్లా కలెక్టర్ హనుమంతరావును కలిసి గోడు వెల్లబోసుకుంది.
KMM: కూసుమంచి మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో, సొసైటీలలో సోమవారం 1460 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని ఏవో అధికారిణి రామడుగు వాణి తెలిపారు. చేగొమ్మ సొసైటీలో 445, ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద 270 బస్తాలు, అన్నదాత పర్టిలైజర్‌లో 270, మనగ్రోమోర్‌లో 445 బస్తాలు, మొత్తం 1430 యూరియా బస్తాలు ఉన్నాయన్నారు.
AKP: నర్సీపట్నంలో ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు కాజేసిన కేటుగాడిని టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు కథనం ప్రకారం సుకల నూకరాజు అనే వృద్ధుడు డబ్బులు కోసం ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న మువ్వ వీరయ్య చౌదరి అనే పాత నిందితుడు ఏటీఎం కార్డు మార్చేసి రూ. 15 వేలు కొట్టేసాడన్నారు.
భారతీయ రైల్వే శాఖ మార్చి 1వ తేదీ నుంచి పాత UTS యాప్‌ను నిలిపివేయనుంది. దాని స్థానంలో సరికొత్త ‘RailOne’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త యాప్ ద్వారా రిజర్వేషన్ అన్‌రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్‌తో పాటు రైలు లైవ్ స్టేటస్ వంటి అన్ని సేవలను ఒకేచోట సులభంగా పొందవచ్చు. ఇది ప్రయాణికులకు ఏకీకృత డిజిటల్ అనుభవాన్ని అందిస్తుంది.
KRNL: ఎమ్మిగనూరులోని గుడికల్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహబూబ్ సుభాన్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. గంజహళ్లి ఉరుసు మహోత్సవానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
ఏలూరు నగరంలోని పలు కాలేజీలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల కేంద్రాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని సూచించారు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో సోమవారం అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి.ఆలయ అర్చకులు జింకా సాంబయ్య స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు.భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
సత్యసాయి: అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల అమ్మకాల పరిస్థితిపై ఆరా తీశారు. చేనేత ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారుల స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు ప్రోత్సాహం అందించారు.
KNR: హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, రామడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.