• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ సీబీఐ జేడీ

JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు అందజేశారు.

February 24, 2026 / 06:06 PM IST

‘గౌరవెల్లి ప్రాజెక్టుపై రాజకీయం వద్దు’

SDPT: గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రైతులను నమ్మించి మోసం చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు అభివృద్ధి కంటే దానిని రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.

February 24, 2026 / 06:04 PM IST

బాపట్ల వ్యవసాయ కళాశాలకు వర్సిటీ హోదా

BPT: బాపట్ల వ్యవసాయ కళాశాలకు విశ్వవిద్యాలయ హోదా కల్పించాలని 1965-69 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కోరారు. మంగళవారం కళాశాలలో జరిగిన సమ్మేళనంలో వారు ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేశారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా.ప్రసూన రాణితో పాటు పలువురు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.

February 24, 2026 / 06:04 PM IST

గోదావరి పుష్కరాలపై ఎస్పీ సమీక్ష

జగిత్యాల జిల్లాలో జరగనున్న గోదావరి పుష్కరాలు-2027 నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పుష్కర ఘాట్లు, వీఐపీ ఘాట్లు, తాత్కాలిక స్నాన ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

February 24, 2026 / 06:04 PM IST

రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

WNP: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు సలహాలు తెలియజేయడానికి 9959226289కు ఫోన్ చేయవచ్చని సూచించారు. వనపర్తి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 06:04 PM IST

‘ఇందిరమ్మ గృహప్రవేశాలతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు’

KNR: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు తొంగిచూస్తాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జరిగిన తమ్మనవేణి మల్లమ్మ, పుట్ట స్వరూప, పుత్లీ బేగం ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

February 24, 2026 / 06:02 PM IST

పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 13 పతకాలు

MBNR: తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మంగళవారం విజేతలను జిల్లా ఎస్పీ డి. జానకి అభినందించారు. అలాగే వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం జిల్లాకు కీర్తి తెచ్చిన క్రీడాకారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.

February 24, 2026 / 06:01 PM IST

పేదల గుడిసెల కూల్చివేత అమానుషం: మాజీ ఎంపీ

KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెలను కూల్చివేయడం అమానుషమని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను నేలమట్టం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు లేదా నివాస స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:01 PM IST

‘అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తాం’

CTR: జిల్లాలో అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డుల మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన DMAC రెండవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, ఎన్ వేలాయుధం, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 06:00 PM IST

37 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జిల్లాలోని 37 పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 BNSS అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 06:00 PM IST

ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష సమావేశం

ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై మంగళవారం కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. భూ సేకరణ సవాళ్లు, మాస్టర్ ప్లాన్ పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే ఆస్తులు, రహదారులు, భవనాలపై చర్చించారు.

February 24, 2026 / 06:00 PM IST

రామాయంపేట భూ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా

MDK: రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడించారు. నిర్వాసితులు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. గజం ప్రభుత్వ విలువ రూ.5,000 ఉండగా కేవలం రూ. 600 చొప్పున పరిహారం ఇవ్వడంపై కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతిపత్రం ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి  కలెక్టర్ భరోసా ఇచ్చారు.

February 24, 2026 / 06:00 PM IST

‘పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి’

NZB: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు కలిగిన గ్రామాల్లో జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని వర్ని ఎస్సై వంశీకృష్ణ రెడ్డి సూచించారు. ఈనెల 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు కలిగిన వర్ని మండల కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని హెచ్చరించారు.

February 24, 2026 / 06:00 PM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: ఎస్సై

SRPT: నడిగూడెం మండల కేంద్రంలో ఈనెల 25 నుంచి మార్చి18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా మండలంలోని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు SI అజయ్ తెలిపారు. పరీక్షలు సాఫీగా జరిగేందుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుమిగూడడం నిషిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

February 24, 2026 / 06:00 PM IST

వేలాది మందికి ప్రాణదాత ఇక లేరు!

E.G: గౌరీపట్నం వాస్తవ్యులు, కార్డియాలజిస్ట్ ముళ్లపూడి వెంకటరత్నం (88) సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. తన కుమార్తె జ్ఞాపకార్థం అమెరికా నుంచి వచ్చి గాజులరామారంలో ఆసుపత్రిని స్థాపించారు. మూడున్నర దశాబ్దాలుగా స్వయంగా 20 వేలకు పైగా ఆపరేషన్లు చేసి పేదలకు వైద్యం అందించారు. ఆయన మరణం తీరని లోటని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

February 24, 2026 / 06:00 PM IST