• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దోమల ఫాగింగ్‌లో భారీ కుంభకోణం

TG: బల్దియా దోమల ఫాగింగ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పంపకాల్లో తేడాలు రావడంతో అవినీతి బాగోతం బయటపడింది. ఫాగింగ్ కోసం కేటాయించిన డీజిల్ వాడకుండా అవినీతికి పాల్పడ్డారు. సిబ్బందికి నెలకు రూ.5 వేలు ఇచ్చి.. మిగిలిన డబ్బులను సూపర్ వైజర్ AE, SE పంచుకున్న వారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. అందుకే డీజిల్‌‌లో మైలాథిన్ కలిపి ఇస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 06:48 PM IST

PAK vs ENG: హెడ్ టు హెడ్ రికార్డు

T20 క్రికెట్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ రెండు జట్లు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 21 సార్లు గెలవగా, పాక్ కేవలం 9 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఇక T20 WCలో.. ఈ రెండు జట్లు 3 సార్లు తలపడగా, అన్ని సార్లు ఇంగ్లండే విజయం సాధించింది. అదేవిధంగా, ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 టీ20 మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లీష్ జట్టే గెలవడం గమనార్హం.

February 24, 2026 / 06:48 PM IST

ఇస్కాన్ మందిరం ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

JGL: ధర్మపురిలో ఇస్కాన్ ప్రతినిధుల బృందం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసింది. నరహరి ప్రభు ఆధ్వర్యంలో వచ్చిన బృందం ధర్మపురిలో ఇస్కాన్ మందిరం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసింది. కృష్ణ భక్తి ప్రచారం, భగవద్గీత శిక్షణ, నిత్య అన్నదానం, గోశాల నిర్వహణ ప్రధాన లక్ష్యాలుగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రేమానంద్, సురనాథ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 06:47 PM IST

BREAKING: ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ టీవీ నటుడు మయాంక్ పవార్ (37) కన్నుమూశాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు ఈరోజు తుదిశ్వాస విడిచాడు. సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, మయాంక్ ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచాడు.

February 24, 2026 / 06:47 PM IST

యువతకు నైపుణ్య నిధి ‘స్టార్టప్ కడప’: కలెక్టర్

కడప: ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్మిస్తున్న ‘స్టార్టప్ కడప’ సెంటర్ పనులను మంగళవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సెంటర్ యువత నైపుణ్యాల వృద్ధికి, ఉపాధికి, నూతన వ్యాపార అవకాశాలకు గొప్ప వేదికగా మారుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

February 24, 2026 / 06:47 PM IST

రెండు నెలల బాలుడి హత్య.. బిగ్ ట్విస్ట్

TG: దుండిగల్ రెండు నెలల బాలుడి హత్యకేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి నుంచి ఏడుస్తున్నాడని కుమారుడిని చంపినట్లు ఆ తల్లి చెప్పడంతో అంతా షాకయ్యారు. చిన్నారిని చంపడంపై భర్త ప్రశ్నించడంతో అతడితో గొడవ పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

February 24, 2026 / 06:45 PM IST

పటాన్ చెరువు ప్రాంతంలో ఇంటింటి సర్వే

SRD: రామచంద్రపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డిప్యూటీ ఆరోగ్య అధికారి ఏఎస్‌డీ కమల కుమారి బృందం ఆధ్వర్యంలో లేక్ వ్యూ రెసిడెన్షియల్ కాలనీలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 30 సంవత్సరాల పైబడిన వారి ఆరోగ్య వివరాలను సేకరించినట్లు కమల కుమారి తెలిపారు. ఈ సందర్భంగా గుండం మోహన్ రెడ్డిని కలిసి ఆరోగ్య సంబంధిత వివరాలు తీసుకున్నారు.

February 24, 2026 / 06:45 PM IST

అకాల వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న

KMR: తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, జొన్న నేలకొరిగింది. దీంతో రైతులు పంట నష్టం జరిగిందని మంగళవారం వాపోయారు. పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు సర్వే చేసి తమను ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన పంటకు పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

February 24, 2026 / 06:44 PM IST

సీఎం చిత్రపటానికి పండ్ల రసాలతో అభిషేకం

RR: కోహెడ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం పట్ల పాలకవర్గం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. మరోసారి రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం నిలిచిందన్నారు.

February 24, 2026 / 06:44 PM IST

‘కుల దురహంకారం నశించాలి.. న్యాయం జరగాలి’

RR: కుమ్మెర జాతరలో అగ్రవర్ణాల దాడికి బలైపోయిన చిన్నారి మృతికి నిరసనగా BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో SDNR పట్టణానికి చెందిన జాతీయ BC జనసేన అధ్యక్షులు చంద్రశేఖరప్ప, నియోజకవర్గ అధ్యక్షురాలు జలజ, తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ కుల దురహంకారం నశించాలని, చిన్నారి తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరారు.

February 24, 2026 / 06:42 PM IST

‘బాధితులకు తక్షణమే డబ్బులు చెల్లించి ఆదుకోవాలి’

HNK: ప్రైవేట్ చిట్ ఫండ్లో డబ్బులు పెట్టి ఇబ్బంది పడుతున్న బాధితులకు తక్షణమే డబ్బులు చెల్లించి వారిని ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేడు రిజిస్టార్‌కు ప్రభాకర్ రెడ్డి అందించారు. ప్రైవేట్ చిట్టీల ద్వారా సేకరించిన ప్రజాధనాన్ని కాజేసిన వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 06:41 PM IST

టీడీపీ నేతను పరామర్శించిన రమాకాంత్ రెడ్డి

KRNL: కమ్మలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ నేత ఈరన్న అనారోగ్యంతో బాధపడుతుండగా, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆయనను ఇవాళ పరామర్శించారు. ఈరన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర బీసీ సాధికారిక సభ్యుడు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ అంజినయ్య, ఆశన్న ఉన్నారు.

February 24, 2026 / 06:41 PM IST

‘అన్ని కేసులు సత్వర పరిష్కారం కావాలి’

E.G: రాజమండ్రిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ఎం.మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇంచార్జ్ బి.పద్మ మంగళవారం మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న న్యాయవాదుల నుంచి సంబంధిత కేసుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కేసులు సత్వర పరిష్కారం కావాలన్నారు.

February 24, 2026 / 06:40 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు

BPT: జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నేపథ్యంలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు క్షేత్రస్థాయిలో పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు వీలుగా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులను మూసివేయించారు.

February 24, 2026 / 06:40 PM IST

‘ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి’

MHBD: తొర్రూరు మండలంలోని గోపాలగిరి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కల్పిస్తున్న వసతులను ఇవాళ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకూబ్ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని అన్నారు. కూలీలకు రోజు వేతనం రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:38 PM IST