SRD: రామచంద్రపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డిప్యూటీ ఆరోగ్య అధికారి ఏఎస్డీ కమల కుమారి బృందం ఆధ్వర్యంలో లేక్ వ్యూ రెసిడెన్షియల్ కాలనీలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 30 సంవత్సరాల పైబడిన వారి ఆరోగ్య వివరాలను సేకరించినట్లు కమల కుమారి తెలిపారు. ఈ సందర్భంగా గుండం మోహన్ రెడ్డిని కలిసి ఆరోగ్య సంబంధిత వివరాలు తీసుకున్నారు.