• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

WGL: చారిత్రక భద్రకాళి ఆలయంలో ఉత్తరాయణం శుక్లపక్షం సందర్భంగా శనివారం అర్చకుడు శేషు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యార్చన, షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూలైన్‌లలో వేచి ఉండి దర్శనం చేసుకుంటున్నారు.

February 28, 2026 / 08:27 AM IST

‘బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి’

MDK: జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణంలో కోట్ల రూపాయల విలువైన భూమికి 15 లక్షలు చెల్లించి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రామాయంపేటకు చెందిన బైరం అర్జున్ నరసమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, బహిరంగ మార్కెట్ ధరతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

February 28, 2026 / 08:26 AM IST

సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

AKP: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. శుక్రవారం ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజాదర్బార్లో ప్రజలు అందజేసిన అర్జీలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు .

February 28, 2026 / 08:25 AM IST

ఇద్దరు MEOలు సస్పెండ్..!

KDP: ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

February 28, 2026 / 08:24 AM IST

జేఎన్యూ వీసీ రాజీనామాకు ఎస్ఎఫ్ఎ డిమాండ్

MBMR: ఢిల్లీలోని జేఎన్యూ (JNU)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడిని నిరసిస్తూ పాలమూరు యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఎ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా, భరత్ మాట్లాడుతూ.. దాడులకు బాధ్యత వహిస్తూ వీసీ శాంతిశ్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

February 28, 2026 / 08:23 AM IST

‘రోడ్డు భద్రత నియమాలు పాటించాలి’

SRCL: రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదలకు దూరంగా ఉండాలని చందుర్తి సీఐ వేంకటేశ్వర్లు అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఆరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహన దారుడు సామాజిక భాధ్యతగా రోడ్డు భద్రత, ట్రాపిక్ నియమాలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహ నాలు నడపకూడదన్నారు.

February 28, 2026 / 08:23 AM IST

ట్రాఫిక్ రూల్స్ కఠినం చేయండి: కలెక్టర్

ELR: జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి‌సెల్వి అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరమున్న చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేయాలన్నారు. రోడ్లపై పశువుల సంచారం విచ్చలవిడిగా ఉంటుందని వివరించారు.

February 28, 2026 / 08:22 AM IST

‘అధికారుల పర్యవేక్షణలో పింఛన్లు పంపిణీ చేస్తున్నాం’

VZM: రాజాం మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు శనివారం NTR భరోసా ఫించన్ల పంపిణీ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణలో లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేటగిరీల వారిగా లబ్ధిదారులకు పెన్షన్‌ మొత్తాన్ని అందిస్తున్న తీరును పరిశీలించి సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు.

February 28, 2026 / 08:22 AM IST

నేడు మున్సిపల్ సర్వసభ్య సమావేశం

PPM: సాలూరు పురపాలక సంఘం సాధారణ సర్వసభ్యు సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ టీ.రత్నకుమార్ తెలిపారు. ఉదయం 11 గంటలకు పురపాలక సంఘం కార్యాలయ కౌన్సిల్ హాలు వద్ద ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, సంబధిత అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో హాజరు కావాలని కోరారు. ఇప్పటికే కౌన్సిలర్లకు సమాచారం అందించమని పేర్కొన్నారు.

February 28, 2026 / 08:20 AM IST

పింఛన్లను పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

ATP: గుంతకల్లులోని పలు వార్డుల్లో శనివారం సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. రేపు సెలవు దినం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. పించన్ల పంపిణీలో సాంకేతిక లోపం వస్తే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

February 28, 2026 / 08:20 AM IST

‘తల్లిదండ్రులు బాధ్యతగా వ్యాక్సిన్ వేయించాలి’

E.G: మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (సెర్వికల్‌ క్యాన్సర్‌) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని MP పురందేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని.. తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలన్నారు.

February 28, 2026 / 08:20 AM IST

నిత్య అన్న ప్రసాద పథకానికి విరాళం

NDL: శ్రీశైలంలో నిర్వహిస్తున్న నిత్య అన్న ప్రసాద పథకానికి కొత్తగూడెం చెందిన సీతా రాంబాబు శుక్రవారం రూ. 5,11,116 విరాళంగా అందజేశారు. స్వామి వారిని దర్శనానికి వచ్చిన ఆయన స్థానిక కార్యాలయంలో సూపరింటెండెంట్ శివప్రసాద్‌ను కలిసిన తరువాత విరాళాన్ని చెల్లించారు. దాతకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి శేష వస్త్రాలతో సన్మానించారు.

February 28, 2026 / 08:20 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న MLC దండే విఠల్

ASF: కాగజ్ నగర్‌లోని ఖదీం మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో MLC దండే విఠల్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ శిక్షణతో నిత్య జీవితంలోనూ సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ వేడుకలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

February 28, 2026 / 08:20 AM IST

‘పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలి’: మంత్రి

KRNL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు (శనివారం) ఉదయం 8:30 గంటలకు బనగానపల్లె పట్టణంలోని బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, వారి సమస్యలను తెలుసుకోనున్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు.

February 28, 2026 / 08:19 AM IST

నేడు శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

WNP: శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మూలమంత్ర హవనం, అనంతరం శేషవాహనంపై తిరువీధి సేవ నిర్వహించనున్నట్లు అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి దర్శనం చేసుకోవాలని వారు కోరారు.

February 28, 2026 / 08:19 AM IST