VZM: రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు శనివారం NTR భరోసా ఫించన్ల పంపిణీ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణలో లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేటగిరీల వారిగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందిస్తున్న తీరును పరిశీలించి సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు.