సత్యసాయి: జిల్లాలోని 25 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. వర్షపాతం, సాగు విస్తీర్ణం, తేమ తదితర అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరువు సహాయక చర్యలతో పాటు రైతులకు రుణాల మంజూరుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఆగలి, హిందూపురం, మడకశిర, కదిరి, పుట్టపర్తి సహా పలు మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్లు గుర్తించారు.
TG: శారదాపీఠం భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేటలో భూములు పీఠానికే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలికి చేసిన భూముల కేటాయింపులను రద్దు చేసింది. పీఠం భూముల్లో నిర్మాణాలపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. సరైన సమాచారం ఇవ్వలేదని అధికారులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు కలిసి వివరాలు అందించాలని పీఠం ప్రతినిధులకు సూచించారు.
ATP: కూడేరు మండల పంచాయతీ కార్యాలయాన్ని DPO T.నాగరాజ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను ఆయన పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో టాక్స్ కలెక్షన్‌లు పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ చేశారు. ప్రభుత్వ సర్వేలో భాగంగా జరుగుతున్న UFS సర్వేను త్వరగా పూర్తి చేయాలని స్వర్ణ గ్రామ సిబ్బందికి ఆదేశించారు.
GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లపై శనివారం గుంటూరులోని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నివాసంపై జరిగిన దాడి వెనుక వీరిద్దరి ప్రమేయం ఉందన్న ఆయన, భవిష్యత్తులో ఈ దాడికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లోకేశ్‌కు బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రాన్ని ఒక చిన్న పిల్లవాడిలా ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పని చేద్దామని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ కార్పొరేషన్ తొలి సమావేశం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణాన్ని రాబోయే కాలంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామన్నారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాత్రికి కాకినాడ వెళ్లనున్నారు. కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ స్వయంగా వెళ్లి పరామర్శించనున్నారు. కాగా, ఈ ఘటనలో 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
కృష్ణా: విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం కోడూరు మండలం బడేవారిపాలెంకు చెందిన సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ బడే కిషోర్ బాబు రూ. 7లక్షలు వ్యయంతో బడేవారిపాలెం జడ్పీ హైస్కూల్, ఉల్లిపాలెం జడ్పీ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్లను ప్రారంభించారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలోని 105 ఏళ్ల చరిత్ర కలిగిన కాంట్రాక్ట్ బస్తీ సమస్యల వలయంలో చిక్కుకుందని, తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాలని కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ కోరారు. శనివారం 18వ వార్డు ప్రజల తరపున మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిధుల ద్వారా అభివృద్ధి చేయాలని కమిషనర్‌ను విన్నవించారు.
PDPL: నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో ఇవాళ ఆయన కలెక్టర్ శ్రీ హర్షతో ఇన్నోవేషన్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు పట్టణాలకే కాకుండా గ్రామాలకు సైతం విస్తరించడం జరుగుతుందన్నారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తయారు చేస్తామని పేర్కొన్నారు.
SRCL: ఇల్లంతకుంటలో స్మశానవాటికలో నీటి సమస్యకు చెక్ పడింది. బోరువెల్‌కు నూతన మోటార్‌ను సర్పంచ్ ఎం.రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కొంతకాలంగా నీటి కొరతతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతుండగా సమస్యను గుర్తించి వెంటనే చర్యలు తీసుకున్నారు. స్మశానవాటికలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
NRML: హైదరాబాద్‌లోని క్రేయాన్ ఆసుపత్రిలో చిన్నారుల వైద్యుడు డా.అభిషేక్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర ఐఎంఏ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐఎంఏ వైద్యులు శనివారం భారీ ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన వైద్యులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
KNR: కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహం గంగాధర పోలీస్ స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, సీజ్ వాహనాల సంరక్షణను పరిశీలించారు. 2023–25 కేసుల పెండింగ్స్, డిస్పోజల్‌పై సమీక్షించి వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఎస్సై వంశీకృష్ణ, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
E.G: గోపాలపురం నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి చెందిన TDP కార్యకర్త పోలిన ఆంజనేయులు ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ.5 లక్షల బీమా చెక్కును MLA మద్దిపాటి వెంకట రాజు శనివారం అందజేశారు. ప్రతి TDP కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
TG: ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెం ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.