• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన SU రిజిస్ట్రార్

KNR: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ & పీజీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యు. సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు.

February 26, 2026 / 08:49 PM IST

నూతన కలెక్టర్‌గా అంకిత్ బాధ్యతల స్వీకారం

BDK: నూతన జిల్లా కలెక్టర్‌గా అంకిత్ గురువారం సాయంత్రం ఐడీవోసి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు.

February 26, 2026 / 08:49 PM IST

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

NRPT: మక్తల్ మండల పరిధిలో మంతన్ గోడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో గురువారం ఉదయం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి.కావేరి, అడిషనల్ కలెక్టర్ డి.అనూష, డీఈవో కే.జ్యోతి, డిప్యుటీ డిఈవో సి.శిరీష, ఏంఈఓ కే.నరేష్ ప్రధాన ఉపాధ్యాయులు md.అబ్దుల్ ఖదీర్ పాల్గొన్నారు.

February 26, 2026 / 08:48 PM IST

మణిపూర్‌లో పర్యటించిన భూపతిరాజు

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మణిపూర్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఖేమ్‌చంద్‌ను కలిశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఊతమిచ్చేలా మణిపూర్‌లో భారీ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. కాగా, ఇప్పటికే మణిపూర్ సీఎం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పునరావాస పనులపై చర్చించారు.

February 26, 2026 / 08:48 PM IST

గద్వాలకు నూతన కలెక్టర్ రాక

GDWL: జనగామ నుంచి బదిలీపై గద్వాలకు రానున్న కలెక్టర్ రిజ్వీన్ భాష షేక్‌కు నడిగడ్డ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. జనగామ అభివృద్ధిలో ఆయన చూపిన పనితీరును చూసిన స్థానికులు, గద్వాల అభివృద్ధికి కూడా అదే ఉత్సాహంతో కృషి చేయాలని ఆశిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్ బీఎం సంతోష్ ట్రైబల్ వెల్ఫేర్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 08:48 PM IST

సర్కారు బడిలో సబ్ కలెక్టర్ తనిఖీ

NZB: బోధన్ సబ్ కలెక్టర్ గురువారం సాలంపాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న బేస్‌లైన్, మిడ్‌లైన్ పరీక్షల సరళిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వర్షిత, గంగ, ప్రసాద్ అనే విద్యార్థుల సమాధాన పత్రాలను స్వయంగా తనిఖీ చేసి, వారి అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు.

February 26, 2026 / 08:46 PM IST

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం

KMR: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని కామారెడ్డి జిల్లా ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సంతోష్ స్పష్టం చేశారు. గురువారం ఇబ్రహీంపేట ZPHSలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

February 26, 2026 / 08:46 PM IST

భాస్కర్‌ను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నేతలు

KRNL: వెల్దుర్తి(మం) కలుగొట్ల గ్రామానికి ఎమ్మిగనూరు ఎమ్మార్పీఎస్ నేతలు వెళ్లి జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్‌ను పరామర్శించారు. ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నం నుంచి ప్రాణాపాయం తప్పించుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

February 26, 2026 / 08:45 PM IST

BREAKING: భారత్ విధ్వంసం.. భారీ స్కోర్

జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజూ(24), అభిషేక్(55) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్(33), సూర్య(33), పాండ్యా(50), తిలక్(44) సమష్టిగా రాణించడంతో.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బౌలర్లలో నగారవ, ముజారబానీ, మాపోసా, సికందర్ తలో వికెట్ పడగొట్టారు.

February 26, 2026 / 08:45 PM IST

జనార్ధన స్వామి వారిని దర్శించిన రాజానగరం ఎమ్మెల్యే

తూ.గో: నవ జనార్ధన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి ఆలయాన్ని గురువారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ పాలకమండలి ఛైర్మన్ బైరిశెట్టి రాంబాబు స్వాగతం పలికారు. స్వామి వారిని ఎమ్మెల్యే బత్తుల దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 26, 2026 / 08:45 PM IST

‘ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోండి’

SKLM: నిరుద్యోగులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎచ్చెర్ల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పీఎం ఉపాధి కల్పన పథకం, సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకం లబ్ధిదారులకు నుంచి శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 26, 2026 / 08:44 PM IST

వీపీఆర్ దంపతులను కలిసిన మేయర్

నెల్లూరు: నగర కార్పొరేషన్‌ మేయర్‌‌గా నూతనంగా ఎన్నికైన దేవరకొండ సుజాత దంపతులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె వారిని శాలువాతో సత్కరించి ఆశీసులు అందుకున్నారు. ఈ సందర్భంగా మేయర్‌కు వీపీఆర్‌ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని సూచించారు.

February 26, 2026 / 08:44 PM IST

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

KMR: దోమకొండ మండలం అంచనూర్‌లో దోమల బెడద నివారణకు సర్పంచ్ జనగామ నరేష్ ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలుగా ఫాగింగ్ చేపట్టామని తెలిపారు. కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇలాంటి చర్యలు కొనసాగించాలని కోరుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

February 26, 2026 / 08:44 PM IST

డయేరియా కట్టడికి కఠిన చర్యలు: జేసీ

SKLM: డయేరియాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఫాస్ట్ ఫుడ్, మాంసం దుకాణాల తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా పరిస్థితిని వేగంగా అదుపులోకి తేవచ్చని తెలిపారు.

February 26, 2026 / 08:43 PM IST

అన్నపూర్ణ సమేత మహాదేవస్వామి కళ్యాణం

NZB: కమ్మర్పల్లి మండలం హస కొత్తూర్ గ్రామంలోని హరిహర క్షేత్రంలో అన్నపూర్ణ సమేత మహాదేవస్వామి కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో స్వామివారి సుప్రభాత సేవ, కల్యాణ ఘట్టాలను భక్తులు అధిక సంఖ్యలో తిలకించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నెలిమెల రేవతి గంగారెడ్డి, వీడీసీ అధ్యక్షులు బంగ్లా లింబాద్రి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

February 26, 2026 / 08:43 PM IST