• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తిమ్మ గురుడు స్వామికి రూ.53 వేల ఆదాయం

KRNL: గూడూరులోని శ్రీ తిమ్మ గురుడు స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ ఈవో గురెడ్డి, చైర్మన్ ప్రభాకర్ నాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన లెక్కింపులో జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.53 వేల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

April 18, 2026 / 10:27 AM IST

లింగగిరి PHCలో 14 ఏళ్ల బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ పంపిణీ

SRPT: హుజూర్‌నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక ‘గార్డసిల్’ టీకాను ఇవాళ్టీ నుంచి ఉచితంగా అందిస్తున్నారు. అర్హులైన బాలికల తల్లిదండ్రులు వెంటనే స్థానిక ANM లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించి, టీకాను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి సూచించారు.

April 18, 2026 / 10:27 AM IST

ఉమ్మడి జిల్లాలో ZPTC, MPTC రిజర్వేషన్లపై తీవ్ర ఆసక్తి

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 75 ZPTC, 778 MPTC స్థానాల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో నోటిఫికేషన్ విడుదలైనప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేయగా, న్యాయస్థానంలో పిటిషన్ల కారణంగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ప్రభుత్వం ఎన్నికల దిశగా అడుగులు వేస్తుండటంతో, పాత రిజర్వేషన్లే కొనసాగుతాయా లేదా కొత్తగా మార్పులు చేస్తారా అన్న చర్చ సాగుతుంది.

April 18, 2026 / 10:26 AM IST

‘శాసనసభ నియోజకవర్గంగా మారిస్తేనే అభివృద్ధి’

మంచిర్యాల: నూతన శాసనసభ నియోజకవర్గ ఏర్పాటుతోనే జన్నారం మండల అభివృద్ధి సాధ్యమవుతుందని నియోజకవర్గ సాధన సమితి నాయకులు అన్నారు. శనివారం జన్నారం మండలంలోని పలు గ్రామాలలో సమితి నాయకులు పర్యటించి నియోజకవర్గ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. జన్నారంను శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు.

April 18, 2026 / 10:26 AM IST

రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు

ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల నుంచి పెదవలస వెళ్లే రహదారి మధ్యలో బొంతువలస ఘాట్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళుతున్న ఓ వ్యాన్‌కు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 18, 2026 / 10:25 AM IST

నెల రోజులైనా ధాన్యం కొనరా..?

KMR: వరి ధాన్యం నూర్పిడి చేసిన వరి కల్లాలు తరలించి నెలరోజులు గడుస్తున్నా కాంటా చేయడంలో అధికారులు, నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి మాచారెడ్డి మండలంలో వరి నూర్పుళ్ళు వేగంగా జరిగాయి. ధాన్యం కల్లాలకు తరలించి ఆరబెట్టి కుప్పలు చేసుకొని కాంటా కోసం ఎదురుచూస్తున్నారు.

April 18, 2026 / 10:25 AM IST

విషాదం.. రిటైర్డ్ ప్రిన్సిపాల్ సజీవదహనం

TG: హైదరాబాద్‌ బేగంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పూజ చేస్తుండగా దీపం చీరకు అంటుకుని రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి సజీవదహనమయ్యారు. సోఫా, కర్టెన్‌లకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఆమె అప్పటికే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 18, 2026 / 10:25 AM IST

చౌడేశ్వరి అమ్మవారి పల్లకి సేవ

NDL: బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు అమ్మవారిని పల్లకీలో ఆశీనులుగా చేసి ప్రత్యేక అలంకరణలతో శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు ఘనంగా సాగింది. వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

April 18, 2026 / 10:24 AM IST

క్షేత్రస్థాయిలో డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్

BDK: పాల్వంచ 33వ డివిజన్‌లో కార్పొరేటర్ బాలు నాయక్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ పరిటాలలో భాగంగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి సమస్యపై ఆరా తీశారు. డీఈ, ఏఈ, సంబంధిత కాంట్రాక్టర్లతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తాగునీటి కొరత, పైపులైన్ లీకేజీలు సమస్యలను గుర్తించారు.

April 18, 2026 / 10:24 AM IST

SRH జట్టులోకి సౌతాఫ్రికా పేసర్

IPL 2026: గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీని తీసుకుంది. రూ.2 కోట్లకు అతణ్ని తీసుకున్నట్లు హైదరాబాద్ టీమ్ ప్రకటించింది. ముంబై, గుజరాత్ కోసం 14 IPL మ్యాచ్‌లాడిన గెరాల్డ్ మొత్తం 15 వికెట్లు తీశాడు. అలాగే ప్రొటీస్ తరఫున 18 T20ల్లో 22 వికెట్లు పడగొట్టాడు.

April 18, 2026 / 10:23 AM IST

పోలీస్ వారికి సోలార్ సీసీ కెమెరాలు అందజేత

MHBD: కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాధావత్ లక్ష్మీరాజునాయక్ నేడు జీపీ తరఫున పోలీసు శాఖ వారికి సోలార్ సీసీ కెమెరాలు అందజేసారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇవి అందజేశామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్ర నాగేశ్వరరావు, వార్డుసభ్యులు, కురవి దేవాలయ మాజీ ఛైర్మన్ భాదావత్ రాజునాయక్, తదితరులున్నారు.

April 18, 2026 / 10:23 AM IST

నగరంలో కొండెక్కిన కొబ్బరి బోండా ధరలు..!

HYD: వేసవి తీవ్రత పెరుగుతున్న వేళ నగరంలో కొబ్బరి బొండాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఉప్పల్, హైటెక్ సిటీ, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఒక్కో బొండం ధర రూ.70 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. ప్రదేశాన్ని బట్టి రేట్లు మారుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు అధికంగా కొబ్బరి నీటిని తీసుకుంటుండటంతో విక్రయాలు పెరిగాయి.

April 18, 2026 / 10:21 AM IST

రుయా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

TPT: రుయా ఆసుపత్రి వైద్యులు ఏలూరుకు చెందిన సుబ్బారావు కడుపులో 10 కేజీల భారీ ప్లీహాన్ని తొలగించి ప్రాణదానం చేశారు. అనేక ఆసుపత్రులు తిరిగినా రోగికి ఈ క్లిష్టమైన ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. రక్తహీనత, తక్కువ ప్లేట్లెట్లతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి డా. శ్రీకాంత్ రెడ్డి బృందం ఆపరేషన్ చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

April 18, 2026 / 10:21 AM IST

ఆరాంఘర్ వద్ద అక్రమ నిర్మాణాలు కూల్చివేత

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఆరాంఘర్ వద్ద ఫుట్‌పాత్ ఆక్రమణలను పోలీసులు తొలగించారు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో డ్రైవ్ నిర్వహించి.. జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగేలా వ్యాపారాలు సాగిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

April 18, 2026 / 10:20 AM IST

కొట్‌పల్లి ప్రాజెక్టు పనులకు మోక్షం

వికారాబాద్: ఎట్టకేలకు కొట్‌పల్లి ప్రాజెక్టు పనులకు మోక్షం లభించింది. ఏడాదిన్నర క్రితం మరమ్మతుల కోసం నిధులు మంజూరు అయ్యాయి. అధికారులు టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ పనులను ప్రారంభించడంలో కలెక్టర్ కాలయాపన చేస్తు వచ్చాడు. దీనిపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో మరమ్మతు పనులు ఉపందుకున్నాయి.

April 18, 2026 / 10:19 AM IST