వికారాబాద్: ఎట్టకేలకు కొట్పల్లి ప్రాజెక్టు పనులకు మోక్షం లభించింది. ఏడాదిన్నర క్రితం మరమ్మతుల కోసం నిధులు మంజూరు అయ్యాయి. అధికారులు టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ పనులను ప్రారంభించడంలో కలెక్టర్ కాలయాపన చేస్తు వచ్చాడు. దీనిపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో మరమ్మతు పనులు ఉపందుకున్నాయి.