NRPT: దామరగిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామ పంచాయతీలో 2026-27 సంవత్సరానికి సంబంధించి తై బజార్ (సంత పన్ను వసూలు) వేలం పాట సోమవారం నిర్వహించనున్నారు. ఆసక్తి గల వేలం దారులు, గ్రామ పెద్దలు ఉదయం 10:30 గంటలకు పంచాయతీ కార్యాలయానికి చేరుకోవాలని కార్యదర్శి రాఘవ సూచించారు. నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నమయ్య: మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులపై కేసు నమోదు చేశామని రామాపురం ఎస్సై శివకుమార్ ఆదివారం తెలిపారు. స్థాని కంగా ఉంటున్న ఆర్ఎంపీ బత్తల వెంకటరమణ, ఆయన తమ్ముడు రాజగో పాల్ మందులు కోపం వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ఫొటోలు తీసి వేధింపులకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.
ASR: గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు అన్నారు. మంప ఎస్సై సీదరి శ్రీనివాస్, ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి ఆదివారం ఆయన రాజేంద్రపాలెం వారపు సంతను సందర్శించారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. వాటికి దూరంగా ఉండాలన్నారు.
ATP: తాడిపత్రిలోని శివ స్కేటింగ్ అకాడమీలో ఆదివారం నిర్వహించిన స్పీడ్ స్కేటింగ్ పోటీలలో తాడిపత్రి జట్టు ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ పోటీలను రిటైర్డ్ పీడీ శివయ్య, ఎస్ఎన్‌ఆర్‌ఎస్‌ఏ సెక్రటరీ రవిబాల జెండా ఊపి ప్రారంభించారు. అనంతపురం, తాడిపత్రి నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
AP: ఇవాళ రాష్ట్రంలో 2.50 లక్షల ఇళ్లలో ప్రభుత్వం గృహప్రవేశాలు నిర్వహించనుంది. లక్ష టిడ్కో ఇళ్లతో పాటు కాలనీల్లో పూర్తయిన మరో 1.50 లక్షల ఇళ్లలో నిర్వహించనున్న గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 11.55AMకు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తారు. అనంతరం చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు. అక్కడ ప్రభుత్వం చేపట్టిన పీ-4 వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
SKLM: నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని, అవి జీవితంలో భాగం కావాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కేఆర్ స్టేడియంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. గెలుపొందిన విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, తదితరులు పాల్గొన్నారు.
NRPT: మద్దూరు మండలం ధంగాన్పూర్ గ్రామంలో మామిళ్ల నరేశ్ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రభుత్వ గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. ఈ వేడుకకు మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సరస్వతి జనార్దన్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
GDWL: శాంతినగర్ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 24వ రోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కమిషనర్ ఎస్. రాజయ్య ఆధ్వర్యంలో 7వ వార్డులో డ్రైనేజీల పూడికతీత, 8వ వార్డులోని ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో శానిటేషన్ నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పరిసరాలను శుభ్రం చేసినట్లు అధికారులు తెలిపారు.
KDP: రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఇంఛార్జ్ మంత్రి సవిత సోమవారం కడప జిల్లా పర్యటనకు రానున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆమె పెనుగొండ నుంచి రోడ్డుమార్గంలో కడపకు వచ్చి ఆర్అండీబీ అతిథిగృహంలో బసచేస్తారు. అక్కడ కాసేపు కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఒంటిమిట్ట వెళ్లి అక్కడ ఉత్సవాల్లో పాల్గొంటారు.
JGL: తల్లిదండ్రుల సంరక్షణకు చట్టబద్ధ బలం కల్పించే “తెలంగాణ ఉద్యోగుల బాధ్యత-తల్లిదండ్రుల సంరక్షణ పర్యవేక్షణ బిల్లు2026” అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సత్కరించారు. కుటుంబ విలువలను కాపాడేందుకు ఈ చట్టం కీలకమని మంత్రి తెలిపారు. వృద్ధుల సమస్యలకు వేగమైన పరిష్కారం కోసం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
KNR: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు శంకరపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వీణవంక మండలం చల్లూరుకి చెందిన శివరాత్రి మల్లేశ్ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా శంకరపట్నం మండలం మక్త గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
KMR: తెలంగాణ హైకోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కామారెడ్డి ప్రాంతానికి చెందిన పి.శ్రవణ్ కుమార్ గౌడ్ భారీ మెజారిటీతో సెక్రటరీగా ఎన్నికయ్యారు. దోమకొండ మండలం గొట్టుముక్కుల గ్రామానికి చెందిన ఆయన 16 ఏళ్లుగా హైకోర్ట్‌లో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఇంతకు ముందు 2019-21 కాలంలో కోశాధికారిగా పనిచేసిన శ్రవణ్ ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
E.G: గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజమండ్రిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రావులపాలానికి చెందిన జాగ్రత్ యువరాజు(24) బీటెక్ చదివాడు. ఇటీవల అతడు ఖాళీగా ఉంటున్నాడని తండ్రి నూకరాజు మందలించడంతో ఈ నెల 27న ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయాడు. కాగా, ఆదివారం అతడు స్థానిక గోదావరి గట్టు ధోబి ఘాట్ వద్ద శివమై తేలాడు.
నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ముధోల్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6న శంకుస్థాపన చేస్తారని MLA రామారావు పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంతో ఇక్కడి ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందనుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. శంకుస్థాపనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ ‘ఐదు గ్యారంటీ’లతో ప్రజల ముందుకు వెళ్తోంది. ప్రధానంగా CAA రద్దు, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహిణులకు రూ. 2,000 నగదు సాయం, టీ ఎస్టేట్ కార్మికుల కనీస వేతనం రూ. 365కు పెంపు, 5 లక్షల ఉద్యోగాల కల్పన వంటి హామీలను ప్రకటించింది. గతంలో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన ‘గ్యారంటీ మోడల్’నే అస్త్రంగా వాడుతోంది.