• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హార్మూజ్ సమీపంలో.. భారత్ ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’

మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ క్రమంలో భారత్ తన ఇంధన భద్రత కోసం హార్మూజ్ జలసంధి వద్ద అత్యంత కీలకమైన ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా హార్మూజ్ జలసంధి సమీపంలో సుమారు ఐదుకు పైగా ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలు నిరంతరం పహారా కాస్తూ, భారత జెండా కలిగిన ఇంధన నౌకలకు ‘రక్షణ కవచం’గా నిలుస్తున్నాయి.

March 30, 2026 / 06:47 AM IST

నేటి నుంచి బాలికలకు HPV వాక్సినేషన్

BHPL: క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ఇవాల్టి నుంచి బాలికలకు HPV వాక్సినేషన్ చేస్తున్నట్లు కాటారం మండల వైద్యాధికారి మౌనిక తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 15 ఏళ్ల లోపు బాలికలు మాత్రమే తీసుకోవాలని, వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు.

March 30, 2026 / 06:46 AM IST

నేడు ‘డయల్ యువర్ APSPDCL CMD’

KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు APSPDCL ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు.

March 30, 2026 / 06:43 AM IST

‘నేటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు’

KDP: ఈ నెల 30వ తేదీ జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కల్యాణోత్సవం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు సంబంధిత కార్యక్రమ ఏర్పాట్లలో ఉన్నందున రద్దు చేసినట్లు తెలిపారు.

March 30, 2026 / 06:42 AM IST

11,193 కేసుల పరిష్కారం: సీపీ

SDPT: శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 11,193 కేసులను పరిష్కరించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇందులో 733 ఐపీసీ, 7,995 డీడీ, 2,465 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయన్నారు. కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం చేకూరడంతో పాటు కోర్టులపై భారం తగ్గిందని పేర్కొన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు పోలీసు సిబ్బందిని ఆమె ఈ సందర్భంగా అభినందించారు.

March 30, 2026 / 06:40 AM IST

నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!

NZB: జిల్లా కేంద్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ యువకుడు ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించాడు. సదరు యువకుడిని గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో మెడపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హతుడు అక్బర్​ బాగ్ ప్రాంతానికి చెందిన అక్షయ్‌గా పోలీసులు గుర్తించారు.

March 30, 2026 / 06:40 AM IST

‘అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలి’

KMR: 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై అసెంబ్లీలో హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ ఏర్పాటు చేయకపోతే సభలో ఇదే విధంగా నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చలు జరిగేలా సభా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

March 30, 2026 / 06:40 AM IST

డాక్టర్లపై దాడులను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

NLG: నిర్మల్ పట్టణంలో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) నీలగిరి బ్రాంచ్ నల్గొండ సభ్యులు ఆదివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

March 30, 2026 / 06:37 AM IST

రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన

సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారులు, ప్రధాన జంక్షన్ల వద్ద ఈ డ్రైవ్ చేపట్టారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించకుండా, ప్రాణ భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు కోరారు.

March 30, 2026 / 06:33 AM IST

అడగకుండానే పదవులు వచ్చాయి: యనమల

KKD: తన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్ వంటి ఉన్నత పదవులు అడగకుండానే తనను వరించాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తుని టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గత 44ఏళ్లుగా పార్టీ తనకు సముచిత గౌరవం ఇచ్చిందన్నారు. యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నానన్నారు

March 30, 2026 / 06:33 AM IST

ఏఎంసీ మాజీ చైర్మన్ మృతి బాధాకరం-మాజీ ఎమ్మెల్యే

MDK: ఏఎంసీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంట రాజు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మెదక్ లోని గంట రాజు నివాసానికి చేరుకుని, భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

March 30, 2026 / 06:33 AM IST

పాణ్యంలో కారు-బైక్ ఢీ.. ఒకరికి గాయాలు

NDL: పాణ్యం మండలం నెరవాడ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. నంద్యాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 30, 2026 / 06:32 AM IST

‘ఈనెల 31న ముత్తారంలో స్పెషలిస్ట్ వైద్య శిబిరం’

PDPL: ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 31 ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పెషలిస్ట్ వైద్యులచే ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ తెలిపారు. గైనిక్, ఆర్తో, పీడియాట్రిక్, డెంటల్, కంటి, జనరల్ సమస్యలకు వైద్యం అందిస్తారని తెలిపారు. కావున ప్రజలు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్‌తో హాజరు కావాలని సూచించారు.

March 30, 2026 / 06:32 AM IST

నేడు ‘తై బజార్’ వేలం పాట

NRPT: దామరగిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామ పంచాయతీలో 2026-27 సంవత్సరానికి సంబంధించి తై బజార్ (సంత పన్ను వసూలు) వేలం పాట సోమవారం నిర్వహించనున్నారు. ఆసక్తి గల వేలం దారులు, గ్రామ పెద్దలు ఉదయం 10:30 గంటలకు పంచాయతీ కార్యాలయానికి చేరుకోవాలని కార్యదర్శి రాఘవ సూచించారు. నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

March 30, 2026 / 06:32 AM IST

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు

అన్నమయ్య: మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులపై కేసు నమోదు చేశామని రామాపురం ఎస్సై శివకుమార్ ఆదివారం తెలిపారు. స్థాని కంగా ఉంటున్న ఆర్ఎంపీ బత్తల వెంకటరమణ, ఆయన తమ్ముడు రాజగో పాల్ మందులు కోపం వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ఫొటోలు తీసి వేధింపులకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.

March 30, 2026 / 06:31 AM IST