• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు మున్సిపల్ బడ్జెట్ సమావేశం

SRPT: సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్లో నేడు ఉదయం 11 గంటలకు మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2025-26 సవరణ, 2026-27 ముసాయిదా బడ్జెట్ ఈ సందర్భంగా ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సాధారణ సమావేశం ప్రారంభమవుతుందని చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత, మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి తెలిపారు.

March 30, 2026 / 07:01 AM IST

నేడు కలెక్టరేట్‌లో ఫిర్యాదుల పరిష్కార వేదిక

‎PLD: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

March 30, 2026 / 07:00 AM IST

విద్యుత్ కంచె తగిలి గేదె మృతి

NLR: లింగసముద్రంలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పంటను రక్షించేందుకు రైతు పొలానికి అక్రమంగా విద్యుత్ కంచె ఏర్పాటుతో, ఆ మార్గంలో వెళ్లిన గేదె విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా కరెంట్ ఏర్పాటు చేసిన రైతుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

March 30, 2026 / 07:00 AM IST

అంబరాన్నంటిన సీతారాముల కళ్యాణ మహోత్సవాలు

VSP: కంచరపాలెం- కప్పరాడ నేషనల్ హైవే సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ జరిగిన సీతారాముల అనుపోత్సవంలో చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నీరాజనాలు పలికారు.

March 30, 2026 / 07:00 AM IST

తేలప్రోలులో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు RCM చర్చిలో మ్రాని కొమ్మల ఆదివారాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తేలప్రోలు గ్రామపురి వీధుల్లో ఫాదర్ గోళ్ల విజయ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు మట్టలు పట్టుకుని యేసు క్రీస్తు కీర్తనలు పాడుతూ ప్రదక్షిణగా చర్చిలోకి ప్రవేశించారు. అనంతరం ఫాదర్ విజయ కుమార్ యేసుప్రభు పడిన శ్రమలను విశ్వాసులకు వివరించారు.

March 30, 2026 / 07:00 AM IST

పేదలకు రూ.17.20 లక్షల CMRF చెక్కులు

RR: హయత్‌నగర్ Tనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ MP మధుయాష్కీ గౌడ్ 23 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.17.20 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ఈ నిధి ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

March 30, 2026 / 07:00 AM IST

నేడు అసెంబ్లీ ముట్టడి.. ఉద్యమకారుల ఫోరం పిలుపు

RR: ఎల్బీనగర్‌లో TG ఉద్యమకారుల ఫోరం నిర్వహించిన పత్రికా సమావేశంలో నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్ తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ మేనిఫెస్టో హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు.

March 30, 2026 / 07:00 AM IST

బాక్స్ క్రికెట్ స్టేడియం ప్రారంభం

AKP: మునగపాక మండలం టి.సిరసపల్లిలో నిర్మించిన బాక్స్ క్రికెట్ స్టేడియంను టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఆదివారం ప్రారంభించారు. యువత క్రీడాల పట్ల ఆసక్తి చూపించాలన్నారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బాక్స్ క్రికెట్ స్టేడియం ప్రతినిధి గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

March 30, 2026 / 07:00 AM IST

నేడు బల్దియలో గ్రీవెన్స్ కార్యక్రమం

HNK: మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇవాళ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజల నుంచి గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి వేదికగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 30, 2026 / 06:58 AM IST

మురుగు కాలువతో నరకయాతన

VKB: బంట్వారం మండలం బొప్పునారం SC కాలనీలో మురుగు కాలువ సమస్య తీవ్రంగా మారింది. కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోగాలబారిన పడే ప్రమాదముందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌కు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

March 30, 2026 / 06:54 AM IST

‘అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ లక్ష్యం’

VKB: నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలకు చదవడం, రాయడం వంటి వాటిని నేర్పించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్ కార్యక్రమం’ ముఖ్య లక్ష్యమని ధారూర్ మండలం రాజాపూర్ సర్పంచ్ కురువ దివ్య అన్నారు. ఆదివారం స్థానిక పాఠశాల ఆవరణంలో మహిళా సంఘం సభ్యులకు ఉల్లాస పరీక్షను నిర్వహించారు. పరీక్షకు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.

March 30, 2026 / 06:52 AM IST

నేడు మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన

కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గం.లకు కె.గంగవరం మండలం కోట గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం  3:30 గం.లకు రామచంద్రపురం పట్టణం టీడీపీ పార్టీ కార్యాలయం నందు P4 బంగారు కుటుంబం 1వ వార్షికోత్సవ రోజు సందర్భంగా జరుగు కార్యక్రమంలో పాల్గొంటారు

March 30, 2026 / 06:52 AM IST

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమలలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారిని నిత్యం మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.

March 30, 2026 / 06:49 AM IST

వైభవంగా కోదండరాముడి రథోత్సవం

WNP: గోపాల్‌పేట మండల కేంద్రంలోని శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి రథోత్సవం (తేరు) అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాటాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

March 30, 2026 / 06:49 AM IST

నేడు నేలకొండపల్లిలో అరైవ్-అలైవ్ కార్యక్రమం

KMM: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం నేలకొండపల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక శ్రీకర గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ (Arrive-Alive) పేరిట ఈ సదస్సు జరుగుతుందని ఎస్సై సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

March 30, 2026 / 06:48 AM IST