VKB: బంట్వారం మండలం బొప్పునారం SC కాలనీలో మురుగు కాలువ సమస్య తీవ్రంగా మారింది. కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోగాలబారిన పడే ప్రమాదముందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌కు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.