• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పునర్విభజన.. ఎస్సీ నియోజకవర్గంగా మాచర్ల?

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం రాబోయే పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ 30-35% వరకు ఎస్సీ ఓటర్లు ఉండటమే దీనికి ప్రధాన కారణం. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలు, ఘర్షణలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో ఆధిపత్య వర్గాలకు చెక్ పెట్టేందుకు, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఈ వ్యూహం జరుగుతోంది.

March 30, 2026 / 06:22 AM IST

రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకుల ముందస్తు అరెస్టు

MBNR: జడ్చర్లను రెవెన్యూ డివిజన్గా, కొల్లూరును మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రేపు నిర్వహించతలపెట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. దీనికి పిలుపునిచ్చిన సాధన సమితి నేతలు డాక్టర్ రమేశ్ నాయక్, కృష్ణ యాదవ్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. జడ్చర్ల రూరల్, అర్బన్ మండలాల ఏర్పాటును కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

March 30, 2026 / 06:21 AM IST

‘మహిళలు చదవడం, రాయడం నేర్చుకోవాలి’

ADB: స్వయం సహాయక సంఘాల మహిళలు తప్పనిసరిగా చదవడం, రాయడం నేర్చుకోవాలని నక్కలవాడ గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలోని నక్కలవాడ గ్రామంలో APM గణేష్ ఆధ్వర్యంలో SHG మహిళలకు అమ్మ అక్షరమాల పరీక్షలను నిర్వహించారు. అనంతరం చదువు ప్రాముఖ్యతను మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో CC భాస్కర్, VOA మనోహర్, తదితరులు ఉన్నారు.

March 30, 2026 / 06:20 AM IST

మాంసం ప్రియులకు షాక్.. రేపు దుకాణాలు బంద్

NLR: మహావీర్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ ఆదేశాల మేరకు మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని మాంసం విక్రయించే కేంద్రాలు మూసివేయాలని ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్ ఆదివారం తెలియజేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని మాంసం దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

March 30, 2026 / 06:18 AM IST

నేడు తిరుపతికి సీఎం.. షెడ్యూల్ ఇదే..!

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు నెల్లబల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన పుదూరుకు చేరుకుని టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేస్తారు. మధ్యాహ్నం బిరదవాడ వద్ద టీడీపీ నాయకులతో సమావేశం అవుతారని అధికారులు వెల్లడించారు.

March 30, 2026 / 06:17 AM IST

నేటి నుంచి కో-ఆప్షన్ పదవులకు దరఖాస్తుల స్వీకరణ

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ పదవులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ అన్వేష్ తెలిపారు. నేటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన వారు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్నవారు ముగ్గురు సభ్యులు (ఒక మహిళ), అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన ఇద్దరు (ఒక మహిళ) అర్హులని పేర్కొన్నారు.

March 30, 2026 / 06:16 AM IST

నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు

KMM: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో కార్పొరేషన్ అధికారులు పన్ను వసూళ్లలో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి క్రమం రద్దు చేసినట్లు వివరించారు.

March 30, 2026 / 06:15 AM IST

కార్యకర్తల ఐక్యతే విజయానికి కీలకం: ఎమ్మెల్యే

KRNL: హొలగుందలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని, ప్రజా సమస్యలపై స్పందిస్తూ విశ్వాసం పొందాలని సూచించారు. కార్యకర్తల ఐక్యతే విజయానికి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 30, 2026 / 06:14 AM IST

పెదప్రోలు పంచాయతీ టెండర్లలో అవకతవకలు

కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామపంచాయతీలో కాంట్రాక్టు లేబర్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు పిలవకుండా అధికారులకు అనుకూల వ్యక్తులకు పనులు అప్పగిస్తున్నారని, గత నాలుగేళ్లుగా ఫిర్యాదులు చేసినా మార్పు లేదని స్థానికులు అంటున్నారు. జీతాలు ఇష్టానుసారం పెంచుతూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

March 30, 2026 / 06:13 AM IST

నేడు 5,403 గృహ ప్రవేశాలు: కలెక్టర్

ATP: రాష్ట్రవ్యాప్త గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో 5,403 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అందులో భాగంగా నేడు తాడిపత్రిలో జరగనున్న ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొననున్నారు. 3,099 హౌసింగ్, 2,304 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

March 30, 2026 / 06:12 AM IST

నేడు అమలాపురం ఎమ్మెల్యే పర్యటన

కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు అమలాపురం పట్టణం 30వ వార్డులో ప్రభుత్వ హౌసింగ్ స్కీం ద్వారా నిర్మించిన గృహానికి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బండారు లంకలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం 4గంటలకు అమలాపురం కలెక్టరేట్‌లో P4 మీటింగ్‌లో పాల్గొంటారు.

March 30, 2026 / 06:10 AM IST

బస్సు కండక్టర్‌పై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు

NZB: మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీజీఆర్టీసీ బస్సు కండక్టర్ హనుమంతుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఎస్సై సుస్మత కేసు నమోదు చేశారు. నర్సింగ్ పల్లి సమీపంలో బస్సు ఆపాలని ప్రయాణికుడు గొడవకు దిగి కండక్టర్‌పై దుర్భాషలాడుతూ కర్రతో దాడి చేసి గాయపరిచాడు. డ్రైవర్, కండక్టర్లను దూషిస్తూ బస్సు ప్రయాణాన్ని అడ్డుకున్నారు. దాడి చేసిన సురేశ్, బాబయ్య పై ఎస్సై ఆదివారం కేసు నమోదు చేశారు.

March 30, 2026 / 06:07 AM IST

యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: DCP

PDPL: యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని డీసీపీ బి.రామ్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి పట్టణంలోని ఇండియన్ మిషన్ హైస్కూల్లో జరిగిన కెరీర్ గైడెన్స్, రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. తల్లిదండ్రులు హెల్మెట్ ధరించేలా చూడాలని కోరారు.

March 30, 2026 / 06:06 AM IST

చెంగాళమ్మకు రూ.1.10 లక్షల విరాళం

TPT: శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. వెంకటగిరికి చెందిన జొన్నదుల ధార్విక్ శివాన్హ్ కుటుంబసభ్యులు రూ.60,000 నగదు విరాళంగా అందజేశారు. అలాగే త్రివేదుల విష్ణు కుటుంబసభ్యులు రూ.50,000 నగదును సమర్పించారు. ఈ విరాళాలను సహాయ కమిషనర్, ఈవో బి.ప్రసన్నలక్ష్మీ స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

March 30, 2026 / 06:04 AM IST

ఉమ్మడి జిల్లాలో 5047 కేంద్రాలకు హైటెక్ హంగులు

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఇకపై ఆధునిక టెక్నాలజీతో దూసుకెళ్లనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు తీపి కబురు అందజేస్తూ వారి పని భారాన్ని తగ్గించేలా, పారదర్శకతను పెంచేలా కొత్త సెల్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. సుమారు 5047 అంగన్వాడీ కేంద్రాలన్నింటిలోని టీచర్లకు కూడా ఈ మొబైల్స్ పంపిణీ చేయనున్నారు.

March 30, 2026 / 06:04 AM IST