• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: DCP

PDPL: యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని డీసీపీ బి.రామ్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి పట్టణంలోని ఇండియన్ మిషన్ హైస్కూల్లో జరిగిన కెరీర్ గైడెన్స్, రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. తల్లిదండ్రులు హెల్మెట్ ధరించేలా చూడాలని కోరారు.

March 30, 2026 / 06:06 AM IST

చెంగాళమ్మకు రూ.1.10 లక్షల విరాళం

TPT: శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. వెంకటగిరికి చెందిన జొన్నదుల ధార్విక్ శివాన్హ్ కుటుంబసభ్యులు రూ.60,000 నగదు విరాళంగా అందజేశారు. అలాగే త్రివేదుల విష్ణు కుటుంబసభ్యులు రూ.50,000 నగదును సమర్పించారు. ఈ విరాళాలను సహాయ కమిషనర్, ఈవో బి.ప్రసన్నలక్ష్మీ స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

March 30, 2026 / 06:04 AM IST

ఉమ్మడి జిల్లాలో 5047 కేంద్రాలకు హైటెక్ హంగులు

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఇకపై ఆధునిక టెక్నాలజీతో దూసుకెళ్లనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు తీపి కబురు అందజేస్తూ వారి పని భారాన్ని తగ్గించేలా, పారదర్శకతను పెంచేలా కొత్త సెల్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. సుమారు 5047 అంగన్వాడీ కేంద్రాలన్నింటిలోని టీచర్లకు కూడా ఈ మొబైల్స్ పంపిణీ చేయనున్నారు.

March 30, 2026 / 06:04 AM IST

క్రీడా పోటీల్లో జడ్చర్ల ఎమ్మెల్యే ఉత్సాహం

MBNR: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ – 2026లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సందడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఆయన సహచర ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పలు క్రీడల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనలోని క్రీడాస్ఫూర్తిని చాటి అందరినీ ఉత్సాహపరిచారు.

March 30, 2026 / 06:03 AM IST

నేడు డ్రైవర్లకు కంటి పరీక్షలు

SRPT: రహదారి భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ -అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నేడు కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో చూపు స్పష్టంగా ఉండటం ప్రమాదాల నివారణకు ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు.

March 30, 2026 / 06:02 AM IST

అత్తను హతమార్చిన కోడలు.. 24 గంటల్లో కేసు ఛేదన

KMR: గాంధారి మండలం సీతాయిపల్లిలో రుక్మవ్వ (73) హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బంగారం, డబ్బుల కోసం కోడలు కోటవ్వ తన అత్తను బండతో కొట్టి చంపినట్లు విచారణలో తేలింది. హత్య అనంతరం ఏమీ తెలియనట్లు డ్రామా ఆడింది. పోలీసుల విచారణలో నిజం తేలింది. నిందితురాలి నుంచి 15 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ఆదివారం రిమాండ్‌కు తరలించారు.

March 30, 2026 / 06:00 AM IST

ALERT: రెండు రోజుల పాటు వర్షాలు

TG: రాగల రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వడగండ్ల వాన, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రైతులు తమ పంటను కాపాడుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

March 30, 2026 / 06:00 AM IST

ముఖ్యమంత్రి పర్యటనకు భారీ బందోబస్తు: ఎస్సీ

KDP: ఏప్రిల్ 1న జరిగే ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవానికి CM చంద్రబాబుతో పాటు పలువురు VIPలు రానున్న దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఉండాలని జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ పోలీసులను ఆదేశించారు. కళ్యాణోత్సవానికి బందోబస్తు నిమిత్తం ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పోలీసులతో సమీక్షించారు. మ్యాప్ ద్వారా ఏర్పాట్లను వివరించారు.పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.

March 30, 2026 / 05:49 AM IST

‘బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’

మెదక్ జిల్లాలో ఎవరైనా క్రికెట్ లేదా ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డివి. శ్రీనివాస రావు హెచ్చరించారు. ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

March 30, 2026 / 05:44 AM IST

అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం

TG: HYDలోని బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్సీ కాలనీలోని ఓ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బిల్డింగ్‌లో 16 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఘటనలో నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధం కాగా.. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 30, 2026 / 05:41 AM IST

మార్చి 30: టీవీలలో సినిమాలు

స్టార్ మా: ఇల్లు ఇల్లాలు పిల్లలు(9AM); జీతెలుగు: రెడీ(9AM); ఈటీవీ: సింహాద్రి(9AM); జెమిని: సై(9AM); స్టార్‌మా మూవీస్: నిను వీడని నీడను నేనే(7AM), లవ్‌స్టోరీ(9AM), ధమాకా(12PM), లైగర్(3PM), స్కంధ(6PM), రఘువరన్ B.Tech(9:30PM); Z సినిమాలు: ఆజాద్(7AM), ఓ మై ఫ్రెండ్(9AM), శివాజీ(12PM), పెళ్ళాం ఊరెళితే(3PM), జెర్సీ(6PM), సైనికుడు(9PM).

March 30, 2026 / 05:41 AM IST

అగ్నిప్రమాదం.. చేతికొచ్చిన పంట బుగ్గిపాలు

ASF: లింగాపూర్ మండల కేంద్రంలో అగ్నిప్రమాదంలో ఇద్దరు రైతుల పంటలు బూడిదయ్యాయి. అర్జున్, బాబురావులకు చెందిన గోధుమ పంట, 23 పైపులు, ఇంజిన్ స్టార్టర్, గడ్డి వాము పూర్తిగా దగ్ధమయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వేడుకున్నారు.

March 30, 2026 / 05:36 AM IST

ఇన్‌ఛార్జ్ డీఎస్పీల నియామకం

CTR: జిల్లా పోలీసు శాఖలో రెండు సబ్ డివిజన్లలో డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవాళ్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు ఇన్‌ఛార్జ్ డీఎస్పీగా పలమనేరులో పనిచేస్తున్న డేగల ప్రభాకర్‌ను నియమించారు. నగరి ఇన్‌ఛార్జ్ డీఎస్పీగా చిత్తూరు పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీగా పనిచేస్తున్న రాంబాబుకు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.

March 30, 2026 / 05:35 AM IST

చేపల వేటకు వెళ్లి, చెరువులో పడి మృతి

NRML: కుబీర్ మండల కేంద్రానికి చెందిన ఫయాజ్ (45) అనే వ్యక్తి భైంసా మండలంలోని గుండెగాం వాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఫయాజ్, తండ్రితో కలిసి ఆదివారం సాయంత్రం చేపలు వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

March 30, 2026 / 05:30 AM IST

ట్రాఫిక్ నిబంధనలపై వాలంటీర్స్‌కు అవగాహన

CTR: ట్రాఫిక్ నిబంధనలపై వాలంటీర్స్‌కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నిత్యబాబు వాలంటీర్స్‌కు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత వివరించారు. అలాగే ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం తెలియజేశారు. రోజుకు ఒక గంట ట్రాఫిక్ వాలంటీర్‌గా సేవలందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

March 30, 2026 / 05:26 AM IST