TG: ఇవాళ ఉభయసభల ముందు కాగ్ నివేదిక పెట్టనున్నారు. మార్చి 2022 ఏడాది కాగ్ నివేదికలను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సామాజిక, ఆర్థిక, సాధారణ రంగాలు, స్థానిక సంస్థలపై కాగ్ నివేదిక ఇచ్చింది. భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమంతో పాటు.. మార్చి 2023 ఏడాదికి ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై.. 2024-25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర లెక్కలపై కూడా కాగ్ నివేదిక పొందుపర్చింది.
PPM: కొమరాడ మండలం దుగ్గి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది సోమవారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
PDPL: ప్రతి హిందువు హిందూ ధర్మరక్షణకు నడుము బిగించాలని శ్రీశ్రీశ్రీ కొత్తకోట శివానంద స్వామి పిలుపునిచ్చారు. జూలపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని తెలిపారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ఆచరించి, దేవాలయాలను శక్తివంతం చేయాలని సూచించారు.
AP: నెల్లూరు జిల్లాలో జంట హత్యల కలకలం చోటుచేసుకుంది. కొడవలూరు మండలం గండవరం పొలాల్లో దుండగులు ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. మృతులను దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య (26)గా గుర్తించారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగిందా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: ఇవాళ్టితో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. 2026-27 ఏడాదికి ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చ జరగనుంది. ఇతర బిల్లులపైనా చర్చించనున్నారు. ఉభయసభల్లో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.
SKLM: కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో బాలికలను మోసం చేసిన రమణ, రామిరెడ్డి, అలాగే సహకరించిన శాంతిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణ ఆదివారం తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రుల నిరంతరం పర్యవేక్షణ అవసరమని తెలిపారు.
AKP: ఎలమంచిలి సబ్ డివిజన్ పరిధిలో అభ్యుదయ రైతులు ఇవాళ ఉదయం విజ్ఞాన యాత్రకు బస్సులో బయలుదేరి వెళ్లారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి జండా ఊపి ప్రారంభించారు. పోలవరం జిల్లా పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి ఆధునిక వ్యవసాయ పద్ధతులు గురించి తెలుసుకుంటారని ఆమె పేర్కొన్నారు. రైతుల వెంట వ్యవసాయ అధికారులు మోహన్ రావు, సరోజినీ వెళ్లారన్నారు.
VSP: ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రథయాత్ర మహోత్సవం వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారిని రథంపై అధిష్ఠింపజేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం వంటి క్రతువులు చేశారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుమార్తె అతిధి గజపతిరాజు రథాన్ని ప్రారంభించారు.
KMR: మద్నూర్ మార్కెట్‌లో పత్తి వ్యాపారం కొనసాగుతుంది. సోమవారం ఉదయం నుంచి పత్తి లోడ్‌తో వాహనాలు వస్తున్నాయి. మంచి క్వాలిటీతో ఉన్న పత్తి ధర క్వింటాకు రూ.7,400, పరిగె పత్తి రూ.6,000 ధర పలుకుతుందని వ్యాపారులు తెలిపారు. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో మూడు జిన్నింగ్ మిల్లులో మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారు.
తిరుపతి: చింతలచేను రోడ్డులోని మంజునాథ ట్రావెల్స్‌లో దారుణం జరిగింది. డ్రైవర్ సెల్వరాజ్ (55)ను క్లీనర్ గోపి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సెల్వరాజ్ తల వెనుక భాగంలో గోపి బలంగా కొట్టి ప్రాణాలు తీశాడని సమాచారం. హత్య అనంతరం నిందితుడు గోపి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని రకాల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి (RC), పొల్యూషన్, ఇన్సూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా బ్రతికే ఉన్నాడో లేదో తెలియదని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇలాంటి తరుణంలో తాజాగా మోజ్తాబా నుంచి కొత్త సందేశం రావడం ఆసక్తి రేపుతోంది. ఈ సందేశంతో మోజ్తాబా బ్రతికే ఉన్నారన్న చర్చ నడుస్తోంది. మోజ్తాబా తన సందేశంలో ఇజ్రాయెల్, అమెరికాతో జరుగుతున్న యుద్ధ సమయంలో దేశానికి మద్దతుగా నిలిచిన ప్రజలను అభినందించారు.
NRPT: ధన్వాడ మండలం బుడ్డమర్రి తండా పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర్ల తండాలో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. ఉపాధి హామీ (NREGS) పథకం కింద కేటాయించిన 4 లక్షల నిధులతో సర్పంచ్ అనిత, ఉప సర్పంచ్ హసలీ భాయ్ ఆదివారం భూమి పూజ చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు.
TG: త్వరలో ప్రభుత్వ ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, MNJలను విదేశీ వైద్య నిపుణులు సందర్శించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ షురూ చేసింది. సమన్వయం చేసేలా ప్రత్యేక వెబ్‌సైట్‌కు రూపకల్పన చేస్తోంది. విదేశాల్లో ఉంటున్న ప్రవాస తెలుగు వైద్యుల సేవలు వినియోగించుకుంటామని ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
బంగాళాదుంపలు అందరూ తినొచ్చు. కానీ మితంగా తినాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందుకే, ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే వేడి పెరిగే అవకాశం ఉంది. వేసవిలో బంగాళాదుంపలను ఫ్రై చేసి తినకూడదు. దానికి బదులుగా ఉడికించి రెండు, మూడుసార్లు తింటే ఆరోగ్యానికి మేలు. కొందరికి వేసవిలో దుంపలు తింటే కడుపునొప్పి, గ్యాస్ జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదు.