SDPT: మర్కూక్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి, స్థానిక ఎస్ఐ దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానమేనని అని అన్నారు.
NTR: పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, నియోజకవర్గంలో పల్లెపండుగ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 32.92 కోట్లు కేటాయించామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలో రూ.30 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అన్నమయ్య: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 976 బస్సులను చెక్ చేసి పత్రాలు లేని 193 బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. చెక్ పోస్టులు కలిపి 16 పాయింట్లలో ఈ తనిఖీలు నిర్వహించారు. అధిక లోడ్‌తో నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
VKB: వికారాబాద్ మహాత్మా జ్యోతిబా ఫులే (ఎంజేపీ) బాలుర గురుకుల విద్యార్థి సాయి కిరణ్ సోమవారం జాతీయస్థాయిలో సత్తా చాటాడు. బెంగళూరులో జరిగిన క్రీడా పోటీల్లో షాట్‌పుట్ విభాగంలో బంతిని 17 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన సాయి కిరణ్‌ను ఎంజేపీ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఘనంగా అభినందించారు.
PDPL: కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలో శివాజీ యువసేన ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: అమరావతి రాజధానికి చట్టబద్ధత పేరుతో సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆరోపించారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిపై చర్చ తప్పించేందుకే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, దోపిడీని మాత్రమే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు.
KMM: జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని సీపీ సునీల్ దత్ అన్నారు. వీటి ద్వారా 6572 కేసులు పరిష్కారమయ్యాయని, 77 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ. 36 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేశారని తెలిపారు. ఎఫ్ఎఆర్ కేసులు -764, ఈ పెట్టి కేసులు -1837, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 3971, సైబర్ కేసులు -77 పరిష్కరించినట్లు చెప్పారు.
KMR: జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్ నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్ జెడ్పీ సీఈవో చందర్ RDO, AO, జిల్లా అధికారులు ఉన్నారు.
✦ ఏటా రూ. 30వేల కోట్ల నుంచి రూ. 43 వేల కోట్లు ఆదా✦ ఈ-20 వల్ల కార్బన్ ఉద్గారాలు 30-40 శాతం తగ్గుముఖం✦ చెరుకు, మొక్కజొన్న, వరి నుంచి తయారీ.. రైతులకు గిట్టుబాటు ధర✦ చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావం దేశంపై తక్కువ✦ వాహనాల ఇంజిన్‌పై ప్రభావం తక్కువఏప్రిల్ 1 నుంచి అన్ని బంకుల్లో ఈ-20 పెట్రోల్ అందుబాటులో ఉంటుంది.
KMM: బోనకల్ మండల పోలీసు వారి ఆధ్వర్యంలో భద్రతా అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రత వారోత్సవాలపై పోలీసులు స్థానికులకు అవగాహన కల్పించారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే క్రమంలో ఇల్లాలు, ఇంటి సభ్యులు వాహనదారుడుకి తప్పకుండా రోడ్డు నియమాలు సూచించాలని అందువల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని తెలిపారు. సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం జనగణన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. సహజీవ జంటలకు కుటుంబ హోదా ఇవ్వనుంది. చాలా కాలంగా కలిసి ఉంటున్న వారిని ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించింది. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇళ్ల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించింది. తొలిసారిగా స్వయంగా వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. 33 ప్రశ్నలతో ప్రశ్నావళి తయారు చేశారు.
KDP: ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఒంటిమిట్ట, రేణిగుంట రహదారులపై ఈ మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 ఉదయం 9 గంటల నుంచి ఏప్రిల్ 2 ఉదయం 8 గంటల వరకు మళ్లింపు కొనసాగుతుంది.
NLG: ఢిల్లీలో జరిగిన ‘టీఈహెచ్ బజార్’ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ చేనేత కళా వైభవం చాటిచెప్పారు. పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత ఆనంద నాగరాజు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రసిద్ధ తేలియా రుమాల్‌తో పాటు సింగిల్, డబుల్ ఇక్కత్ వస్త్రాలను ఆయన ప్రదర్శించారు. మన సంప్రదాయ కళకు ఢిల్లీ వేదికగా దక్కిన ఈ గౌరవంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP: నక్సల్స్ ఫ్రీ స్టేట్‌గా ఏపీ మారిందని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. 9 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. దళంతో కలిసి కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణరావు అలియాస్ సోమన్న లొంగిపోయాడని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల బెనిఫిట్స్ అందిస్తామన్నారు. నారాయణరావుకు రూ.25 లక్షలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నామని, మిగితా మావోయిస్టులకు రూ.24.20 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు.
ASF: పిల్లలు సరదా కోసం చెరువులు, కాలువలకు ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. మధ్యాహ్నం వేళల్లో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు. కచ్చితంగా పెద్దల పర్యవేక్షణలోనే ఈతకు వెళ్లేలా చూడాలని SP కోరారు.