E.G: పెరవలి మండలం నడుపల్లి కోటలో సమగ్ర శిక్ష నిధులతో రూ.23.95 లక్షల వ్యయంతో పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. నాణ్యమైన విద్య అందించాలంటే పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు, సదుపాయాలు ఉండాలన్నారు.
BDK: రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందుల నిల్వలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ముఖ్యంగా కుక్క కాటు నివారణకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, నాణ్యమైన వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు.
JGL: రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలుగు వ్యాస రచన పోటీల్లో బుగ్గారం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కెతి శ్రావ్య విజేతగా నిలిచింది. హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి మిట్టపల్లి సురేందర్, సంస్థ అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్ చేతుల మీదుగా ఆమెకు నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు.
AP: ప్రియురాలిని ముక్కలుగా నరికిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రవీంద్రను బాధితురాలి బంధువులు చితకబాదారు. పోలీసులు అతడిని సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలానికి తీసుకురాగా వారంతా దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ మౌనిక తండ్రి CI కాళ్లపై పడి వేడుకున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు.
NGKL: పట్టణ బస్టాండ్ ఆవరణలో ఓ సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డీపో డీఎం, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బాదం రమేష్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
SRCL: సహారా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు ఎలాంటి షరతులు లేకుండా డబ్బులు అందించాలని సీపీఎం మండల అధ్యక్షుడు కోడం రమణ అన్నారు. ఈ మేరకు తంగళ్ళపల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో విజయ ప్రకాష్ రావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. సహారాలో డిపాజిట్ చేసిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
తిరుపతిలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయిన ఘటన సోమవారం వెలుగు చూసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్‌లో ఓ వైన్ షాప్ వద్ద చనిపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదు. భిక్షగాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
AP: పల్నాడు జిల్లా పోనుగోటివారిపాలెంలో వాంతులు, విరేచనాలతో 20 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. నరసరావుపేట, ముప్పాళ్ల ఆస్పత్రుల్లో అతిసార బాధితులు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో అతిసార ఆనవాళ్లు లేవన్న Dy. DMHO తెలిపారు. గ్రామంలో వైద్య సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
PLD: చిలకలూరిపేట పరిధిలోని పసుమర్తి సమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఇంకొల్లు నుంచి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తున్న బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
HYD: అంజయ్య నగర్ వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన తనిఖీ చేశారు. వారం లోగా చెట్లను తరలించడం/ నరికి వేయడం, విద్యుత్ స్తంభాలను మార్చడం పూర్తిచేసి రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
కడప: ఏప్రిల్ 1న జరిగే కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఇంఛార్జ్ మంత్రి ఎస్. సవిత తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, ప్రసాదం, ఎల్ఈడీ స్క్రీన్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
CTR: రేపు పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించినట్లు MRO రాము సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.
E.G: బీసీ సోదరుల హక్కుల పరిరక్షణ కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సిద్ధపడ్డారని పార్టీ గోపాలపురం కన్వీనర్ నాచుకు ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11న ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీక్షకు మద్దతు పలకాలని కోరుతూ ఇవాళ గోపాలపురంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.
MNCL: సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారానికై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ సింగరేణి జాతా’ ముగిసింది. ఈ సందర్భంగా సోమవారం కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ఎదుట నిర్వహించిన ధర్నాలో శ్రీరాంపూర్ ఏరియా నాయకులు పాల్గొన్నారు. మెడికల్ బోర్డును పాత విధానంలో కొనసాగించాలని, స్ట్రక్చర్ కమిటీ నిర్ణయాలు, సొంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
KRNL: అమరావతికి వైసీపీ పార్టీ వ్యతిరేకం కాదని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. R&B గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో శాశ్వత భవనాలు కూడా నిర్మించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనులు కనిపించడం లేదన్నారు. జగన్‌పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.