• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మండలంలో అపహాస్యమవుతున్న ‘ప్రజావాణి’!

KMR: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం’తాడ్వాయి మండల కేంద్రంలో అపహాస్యమవుతోంది. సోమవారం మండల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. తమ గోడు చెప్పుకుందామని గ్రామాల నుంచి ఆశతో వచ్చిన సామాన్యులకు అక్కడ వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.

March 30, 2026 / 03:37 PM IST

టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం: ధర్మాన

AP: టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ‘దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాకు అన్యాయం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతలను తరిమికొట్టాలి. మూలపేట, భోగాపురం పోర్టుల పేరుతో మోసం చేస్తున్నారు. రెండేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పుచేశారు. అమరావతికే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో లేదా?’ అని ప్రశ్నించారు.

March 30, 2026 / 03:36 PM IST

ఆస్తి వివాదం.. వ్యక్తిపై యాసిడ్ దాడి.!

GNTR: పొన్నూరు(మం) చింతలపూడిలో ఆస్తి వివాదం యాసిడ్ దాడికి దారితీసింది. గ్రామానికి చెందిన మారుపూడి సుబ్బయ్య (65) అదే గ్రామానికి చెందిన కోడూరు శ్రీనివాసరావు (65)పై యాసిడ్‌తో దాడి చేశాడు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 30, 2026 / 03:36 PM IST

ఎలక్ట్రానిక్ బస్సులు నిలపాలని వినతి

MHBD: తొర్రూరు మండలంలోని నాంచారి మడూరు వద్ద ఎలక్ట్రానిక్ ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపాలని కోరుతూ.. సర్పంచ్ బంగారు రమేష్ ఆధ్వర్యంలో ఇవాళ డిపో మేనేజర్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… చుట్టుపక్కల మండలాల నుండి ప్రజలు నాంచారి మడూరుకు వ్యాపారం, అవసరాల నిమిత్తం వస్తుంటారని, కావున బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

March 30, 2026 / 03:34 PM IST

రేపు శ్రీ హరి హర క్షేత్రం 20వ వార్షికోత్సవం

ప్రకాశం: చీమకుర్తిలో శ్రీ హరి హర క్షేత్రం నందు 20వ వార్షికోత్సవం మంగళవారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆరోజు ఉదయం స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు తదుపరి స్వామివారికి నగర ఉత్సవం ఘనంగా జరగనుంది. సాయంత్రం వేళల్లో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో విద్యుత్ మహా ప్రభ నెలకొల్పనున్నట్లు ఆయల నిర్వహకులు తెలిపారు.

March 30, 2026 / 03:33 PM IST

కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి: MRPS

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనను జై భీమ్ MRPS రాష్ట్ర అధ్యక్షుడు జానయ్య మాదిగ సోమవారం ఖండించారు. ఎస్సీ వర్గానికి చెందిన దళిత నాయకుడిని బెదిరించడం సరికాదన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత హక్కులపై దాడి సహించమని వారు హెచ్చరించారు.

March 30, 2026 / 03:32 PM IST

అంగన్వాడీ కేంద్రాన్ని వేరే గ్రామానికి మార్చోదు

VZM: బాడంగి మండలం పినపెంకి పంచాయతీ పరిధిలోని గదబవలస గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని అదే గ్రామంలో కొనసాగించాలని సీఐటీయూ మండల కన్వీనర్ ఎ. సురేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో, ఎమ్మార్వోలకు వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఇతర గ్రామానికి మార్చేందుకు అధికారులు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

March 30, 2026 / 03:32 PM IST

‘ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల మూలపేట పోర్టు’

PPM: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాలు కల మూలపేట పోర్టు అని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. 2023 ఏప్రిల్ 19న మూలపేట కోర్టుకు జగన్ శంకుస్థాపన చేశారని 70 శాతం పనులు పూర్తి చేశారని అన్నారు. మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం టీడీపీ అని దుయ్యబట్టారు. జగన్‌కు మంచి పేరు వస్తుందని చెప్పి కోర్టు నిర్మాణం పూర్తి చేయలేదని అన్నారు.

March 30, 2026 / 03:32 PM IST

బంగ్లాదేశ్‌లో IPL ఫ్యాన్స్‌కు SHOCK

బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది IPL మజా ఇక కలగానే మిగలనుంది. IPL-2026 బ్రాడ్‌కాస్ట్ అగ్రిమెంట్‌ను జియో హాట్‌స్టార్ అనూహ్యంగా రద్దు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రసారాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం రావడం చర్చనీయాంశమైంది. దీంతో అక్కడి ప్రేక్షకులు IPL లైవ్ ధమాకాను వీక్షించే సువర్ణావకాశాన్ని కోల్పోయారు.

March 30, 2026 / 03:32 PM IST

కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ISO సర్టిఫికేట్

కోనసీమ: రాష్ట్ర వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీలను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల (ISO) సర్టిఫికేట్ కోసం ఎంపిక చేశారు. అందులో అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ఈ ప్రతిష్టాత్మక ISO సర్టిఫికేట్ లభించడం గర్వకారణమని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇవాళ గ్రామ సర్పంచ్ రాకాపు విజయలక్ష్మిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

March 30, 2026 / 03:31 PM IST

‘సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తాం’

SDPT: సిద్ధిపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాలకవర్గ సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అరుణ, జనరల్ సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

March 30, 2026 / 03:30 PM IST

జోగుళాంబ ఆలయంలో వేద పారాయణం

GDWL: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదైన అలంపూర్ శ్రీ జోగుళాంబ దేవి ఆలయంలో లోక కల్యాణం, భక్తుల యోగక్షేమం కోసం అర్చకులు, వేద పండితులు నిత్యం వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో త్రిశతి, ఖడ్గమాల పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ప్రతినిధి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.

March 30, 2026 / 03:30 PM IST

పట్టణంలో గోపాల కాలువలు కార్యక్రమం

MDK: తూప్రాన్ పట్టణంలో సోమవారం గోపాల కాలువలు కార్యక్రమం చేపట్టారు. పట్టణ శివారులోని పురాతన రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఈనెల 25 నుంచి నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం గోపాల కాలువలు ఉత్సవ నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయం నుంచి స్వామివారిని పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పిల్లలతో వీధుల్లో ఉట్టి కొట్టే కార్యక్రమం చేపట్టారు.

March 30, 2026 / 03:30 PM IST

హిందూ దేవాలయాల భూములను రక్షించాలి: BJP

E.G: హిందూ దేవాలయాల భూములను రక్షిస్తూ.. శిధిలావస్థలో ఉన్న ఆలయాలను పున: నిర్మించాలని BJP జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కోరారు. ఇవాళ రాజమండ్రిలోని కలెక్టర్ వద్ద నిర్వహించిన PGRSలో వినతి పత్రం అందజేశారు. హిందూ ఆలయ భూములు ఇతరులకు చేతుల్లోకి వెళ్ళటం అంగీకారయోగ్యం కాదని, ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆలయ నిర్మాణాలకు సహకరించాలని కోరారు.

March 30, 2026 / 03:29 PM IST

‘బీజేపీ బలోపేతానికి కష్టపడి పని చేయాలి’

JN: బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. రఘునాథపల్లిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ సన్నాహక సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలన్నారు.

March 30, 2026 / 03:28 PM IST