VZM: బాడంగి మండలం పినపెంకి పంచాయతీ పరిధిలోని గదబవలస గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని అదే గ్రామంలో కొనసాగించాలని సీఐటీయూ మండల కన్వీనర్ ఎ. సురేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో, ఎమ్మార్వోలకు వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఇతర గ్రామానికి మార్చేందుకు అధికారులు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.