కడప నగర ట్రాఫిక్ సీఐగా యం. తులసీరామ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రోడ్డు భద్రత మెరుగుదలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టం చేసి, ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.