NDL: నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఇవాళ ట్రాక్టర్ ఢీకొని గాయపడిన వ్యక్తిని గుర్తించిన ఎంపీ డా.బైరెడ్డి శబరి వెంటనే కారు దిగి పరిశీలించారు. బాధితుడి పరిస్థితిని తెలుసుకుని సమీప ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.