VSP: నార్వే రాయబారి మే-ఎలిన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం విశాఖపట్నం పోర్టును సందర్శించింది. పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కోరటి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టు మౌలిక సదుపాయాలు, కార్గో నిర్వహణ సామర్థ్యాలు, పర్యావరణ కార్యక్రమాలు, ఆధునీకరణ చర్యలను వివరించారు. పోర్టు ఆతిథ్యానికి నార్వే బృందం కృతజ్ఞతలు తెలిపింది.