MHBD: తొర్రూరు మండలంలోని నాంచారి మడూరు వద్ద ఎలక్ట్రానిక్ ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలని కోరుతూ.. సర్పంచ్ బంగారు రమేష్ ఆధ్వర్యంలో ఇవాళ డిపో మేనేజర్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… చుట్టుపక్కల మండలాల నుండి ప్రజలు నాంచారి మడూరుకు వ్యాపారం, అవసరాల నిమిత్తం వస్తుంటారని, కావున బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.