కోల్‌కతాపై రోహిత్ శర్మ విధ్వంసక ఆట తీరును చూస్తుంటే ‘రోహిత్ 2.O’ సిద్ధమైనట్లు కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. నరైన్, వరుణ్ వంటి స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొన్నాడని కొనియాడాడు. KKR తమ బౌలింగ్ వనరులను సరిగ్గా వాడుకోలేదని, ముఖ్యంగా పవర్‌ప్లేలో నరైన్‌ను ఆలస్యంగా దించడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని వివరించాడు.