నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, నిద్రలేమి, హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇది సాధారణ తలనొప్పి కాదు, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. యోగా, సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.