SKLM: జిల్లాలో 1112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూ రైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం తెలిపారు. 44వ వార్డులో PM ఆవాస యోజన 2.0 కింద మంజూరైన గృహాన్ని స్థానిక MLA శంకర్‌తో కలసి ఆయన గృహ ప్రవేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్దిదారులకు పెండింగులో ఉన్న బిల్లులు సత్వరమే విడుదల చేయనున్నట్లు తెలిపారు.