E.G: భీమవరంలో వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెనవెంకటరామరాజు సౌజన్యంతో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో వచ్చే నెల 2న ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రోగ్రాం కన్వీనర్ ఇందుకూరి ప్రసాద రాజు సోమవారం తెలిపారు. వైద్య శిబిరం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఇందులో మానవతా సంస్థ ఛైర్మన్ బుద్ధరాజు, తదితరులు పాల్గొన్నారు.