ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్లలో, OTTల్లో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 3న బైకర్, రాకాస, కార్మేని సెల్వం, లీడర్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’, వధ్ 2 స్ట్రీమింగ్ కానున్నాయి. జీ5లో మార్చి 31న ‘హే బల్వంత్’ అందుబాటులోకి రానుంది.
W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో అనుమతులు లేని పలు వాటర్ ప్లాంట్లపై అధికారులు సోమవారం ఉగ్రరూపం ప్రదర్శించారు. లైసెన్సులు లేని, కలుషిత నీరు సరఫరా చేస్తున్న వాటర్ ప్లాంట్లపై దాడులు చేసి సీజ్ చేశారు. నగర పంచాయతీ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఏఈ విజయ్ కుమార్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ సాకేత్ బాబుల ఆధ్వర్యంలో ప్లాంట్లకు తాళాలు వేశారు.
HNK: మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ అన్నారు.పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని హానుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు అవసరమైన గ్యాస్‌లను అన్ని పాఠశాలలకు ఉచితంగా ఇవ్వాలని రమేష్ కోరారు.
TG: సీట్ల పెంపులో వివక్ష ఉంటే భవిష్యత్తులో రాష్ట్ర బీజేపీ నేతలైన బండి సంజయ్, కిషన్ రెడ్డికు కూడా విలువ ఉండదని, వారికి ఉద్యోగాలు కూడా ఉండవని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఉత్తరాది ఆధిపత్యం పెరిగితే దక్షిణాది నేతలను ఎవరూ గుర్తించరని అన్నారు. దక్షిణాది హక్కుల కోసం బీజేపీ నేతలు నాయకత్వం వహించినా, పోరాడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు.
VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 31 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్‌సీ, ఎస్‌టీ సెల్ డీఎస్పీ ఎం. వీరకుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు 2, మోసాలకు సంబంధించినవి 3 ఉన్నాయన్నారు.
కృష్ణా: రాష్ట్రంలో పేద వర్గాల సొంత ఇంటి కలలో నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం 30వ వార్డు వడ్డే వారి స్ట్రీట్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న పూరేటి వరలక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో PMAY పథకం కింద 1310 మంది ఎంపిక అయ్యారని తెలిపారు.
AP: రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల ఆధార్ వివరాలు, వాహన నంబర్లను రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
ASR: డుంబ్రిగుడ శాఖ గ్రంథాలయాన్ని జిల్లా ఛైర్మన్ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పాఠకులతో మాట్లాడి అందుబాటులో ఉన్న సౌకర్యాలను తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయంలో వైఫై సేవలను ఆధునీకరించనున్నట్లు తెలిపారు.
MHBD: నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరగడంపై కాంగ్రెస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ హయాంలో కేసులు ఎదుర్కొని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని కాపాడిన సీనియర్ నేతలకు గుర్తింపు దక్కడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలతో పాటు కార్పొరేషన్ పదవులు భర్తీ చేపట్టాలని కోరుతున్నారు.
ప్రకాశం: సీ.ఎస్.పురం మండలం అంబవరం పంచాయతీ పరిధిలోని అంబవరం కొత్తపల్లి స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు ఈ సచివాలయం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలు సచివాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SRCL: విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లాలోని జిల్లాలోని 13 కేజీబీవీలు, ఏడు టీజీఎంఎస్ హాస్టళ్లకు కలిపి 20 ఫ్రీజర్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక చొరవతో సమకూర్చారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం అందజేశారు.
PDPL: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఉద్యమకారులు NTPCలోని ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు తోడేటి శంకర్ గౌడ్, వల్లాల మల్లేశం, పోన్నం విజయ్ గౌడ్‌లు ఉన్నారు.
NGKL: వెల్దండ మండలం చెదురుపల్లిలోని పోస్ట్ ఆఫీస్‌ను వేరే చోటికి తరలించడంపై సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ ఊరి కార్యాలయం తమకే కావాలని, తరలింపునకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, తిరుపతయ్య గౌడ్ పాల్గొన్నారు.
MBNR: ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం (R&R) కోసం ప్రభుత్వం మరో రూ.150 కోట్లు విడుదల చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనితో ఇప్పటివరకు విడుదలైన మొత్తం రూ.400 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్యాకేజీ నిధుల పంపిణీ వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
SRD: బీరంగూడ ప్రభుత్వ ఐటీఐలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇవాళ DYFI, SFI, CITU ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్, సీఐ నరేష్ హాజరై ప్రసంగించారు. విద్యార్థులు మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం బిగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభలో సీఐటీయూ నేత రాజయ్య, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.