BDK: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వర్కర్స్ యూనియన్ చేపట్టిన కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హెడ్ ఆఫీస్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి మూడు గంటల పాటు ధర్నా చేపట్టారు. పలువురు నేతలను అరెస్ట్ చేశారు.
NTR: నందిగామ రెవిన్యూ డివిజన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీ కే పోసి బాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 7 అర్జీలు అందగా, రెవిన్యూ శాఖకు 3, విద్యా శాఖకు 2, వ్యవసాయ శాఖకు 1, సర్వే శాఖకు 1 అర్జీ వచ్చినట్లు తెలిపారు. అర్జీలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సకాలంలో పరిష్కరించాలన్నారు.
VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో గృహ నిర్మాణ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) – హౌసింగ్ ఫర్ ఆల్ (HFA) పథకంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 2,50,893 ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా సోమవారం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల చేతులమీదుగా లబ్ధిదారులకు 4,286 ఇళ్ల పంపిణీ చేశారు.
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం అల్లివలస జనసైనికుడు అప్పన్న యాక్సిడెంట్‌లో గాయపడి శ్రీకాకుళం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం జనసేన పార్టీ ఇంఛార్జ్ డా. విశ్వక్సేన్ అప్పన్నను పరామర్శించి రూ.5000 మెడికల్ ఖర్చుకు అందజేశారు. ఆయనతో పాటు రణస్థలం మండల మైలపల్లి రాంప్రసాద్, కాకర్ల బాబాజీ తదితరులు ఉన్నారు.
PPM: పీ-4తో బంగారు కుటుంబాల తలరాతలు మారనున్నాయని, పేదరికం లేని సమాజమే లక్ష్యం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పీ-4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆధార్ కార్డు నిర్మూలన చేయటమే సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అన్నారు.
MULG: ములుగు పట్టణంలో పన్నులు చెల్లించేందుకు ఈనెల 31తో గడువు ముగుస్తుందని మున్సిపల్ కమిషనర్ రమేష్ సోమవారం తెలిపారు. తర్వాత జరిగే చెల్లింపులకు వడ్డీ వర్తిస్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో టాక్స్ వసూళ్లను పరిశీలించిన కమిషనర్, పలు గృహాలు, దుకాణ సముదాయాలకు వెళ్లి స్వయంగా పన్నులను వసూలు చేశారు. ఇప్పటివరకు 70 శాతం ఆస్తి పన్నులు వసూలైనట్లు వెల్లడించారు.
NZB : డ్రంకెన్ డ్రైవ్లో ముగ్గురికి జైలు శిక్ష, మరో 27 మందికి జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ ప్రసాద్ తెలిపారు. ఇటీవల నిజామాబాద్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్లో 30 మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆదేశాల మేరకు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఇందులో ముగ్గురికి జైలు శిక్ష విధించారు.
వొడాఫోన్ ఐడియా (Vi) తన 5G సేవల విస్తరణను వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది మే నాటికి కొత్తగా 90 నగరాల్లో 5Gని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మొత్తం నగరాల సంఖ్య 133కు చేరనుంది. AP, TG సహా 15 సర్కిల్స్‌పై దృష్టి సారించిన సంస్థ.. HYD, తిరుపతి వంటి నగరాల్లో సేవలు ప్రారంభించనుంది. క్వాలిటీని పెంచి వినియోగదారులను ఆకర్షించాలని Vi భావిస్తోంది.
HYD: నిమ్స్ (NIMS) ఆస్పత్రి వృద్ధుల కోసం ఒక శుభవార్త అందించింది. రేపు (మార్చి 31) ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ప్రకటించారు. ఆస్పత్రిలోని జీరియాట్రిక్ (Geriatric) విభాగంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. వృద్ధులకు అవసరమైన ఉచిత వైద్య పరీక్షలు చేసి, తగిన సలహాలు అందించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
PLD: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఏ మాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSలో ఆమె పాల్గొని బాధితుల నుంచి 103 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు తక్షణమే ఊరటనివ్వాలని స్పష్టం చేశారు.
TG: అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రులు ‘గాలి తిరుగుడు’ తిరుగుతున్నారన్న BJP నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. భట్టి, పొన్నం ఈ పదజాలాన్ని ఖండించి, ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. దీంతో స్పీకర్ సూచనతో, తన వ్యాఖ్యలు తప్పుగా అర్థమైతే వెనక్కి తీసుకుంటానని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
EG: ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన p4 విధానాన్ని రాజానగరం నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి ఇవాళ అభినందించారు. p4 స్ఫూర్తితో వెదుళ్ళపల్లి స్కూల్ భవన నిర్మాణము, భోజనశాలకు కాంపౌండ్ వాల్‌కు సొంత నిధులు యాజమాన్యానికి అందజేశారు. దాతల స్ఫూర్తిని కొనియాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వీరన్న చౌదరిని సన్మానించారు.
TG: ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ఆపడానికి కేంద్రం తక్షణమే చొరవ తీసుకోవాలని కోరుతూ Dy CM భట్టి విక్రమార్క శాసనసభలో కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాంతి స్థాపనలో భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. యుద్ధం వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను అరికట్టేందుకు దౌత్యపరమైన చర్చలు జరపాలని సభ కోరింది.
VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి స్వయాన సోదరుడు, ప్రముఖ న్యాయవాది కీ.శే కోలగట్ల తమ్మన శెట్టి ఆకస్మిక మరణం పట్ల భీమిలి జడ్పీ ఛైర్మన్ వెంకట అప్పలనాయుడు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు అప్పలనాయుడు, వెంకటనారాయణ (సర్పంచ్), తాతీ నాయుడు తదితర నాయకులు తమ్మన శెట్టి నివాసానికి చేరుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.