• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పీహెచ్సీలో అగ్నిమాపక శాఖ డెమో

BDK: బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరలో ఉన్న పీహెచ్సీలో సోమవారం భద్రాచలం అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో డెమోను నిర్వహించారు. హాస్పిటల్లో ప్రమాదవశాత్తు ఏమైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలో సూచించారు. ఫైర్ ఎస్టర్ విషర్ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో చూపించారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ పావని రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

March 30, 2026 / 04:53 PM IST

ఇరాన్​పై యుద్ధానికి వ్యతిరేకంగా నగరంలో ర్యాలీ

NZB: ఇరాన్​ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్​ దాడులను ఖండిస్తూ జిల్లా యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​, సీపీఐఎంల్​ మాస్​లైన్ నాయకులు పాల్గొన్నారు.​ యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు సాగింది.

March 30, 2026 / 04:53 PM IST

ఆసుపత్రిలో సర్వేలెన్స్ కేంద్రం పరిశీలన

బాపట్ల ఏరియా వైద్యశాలలోని సెంటినెల్ సర్వేలెన్స్ కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి నాగార్జునరావు తనిఖీ చేశారు. డెంగీ నిర్ధారణ పరీక్షల విధానాన్ని పరిశీలించి, రోగుల వివరాలను సమయానికి నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి అధికారులతో పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

March 30, 2026 / 04:52 PM IST

కలసపాడు తహసీల్దారుగా రవీంద్రారెడ్డి

KDP: కలసపాడు మండల తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న మధురవాణి ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో రవీంద్రారెడ్డిని నియమించారు. ఆయన సోమవారం కలసపాడు MROగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సత్వర పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.

March 30, 2026 / 04:52 PM IST

అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

MDCL: మాల్కాజిగిరి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. బాలవాటిక, ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ వ్యవస్థల మధ్య గందరగోళం నెలకొంటోందని తెలిపారు. 72 కేంద్రాలు అభివృద్ధికి నోచుకోలేదని, అనేక కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.

March 30, 2026 / 04:52 PM IST

రోహిత్ 2.O రెడీ..: అనిల్ కుంబ్లే

కోల్‌కతాపై రోహిత్ శర్మ విధ్వంసక ఆట తీరును చూస్తుంటే ‘రోహిత్ 2.O’ సిద్ధమైనట్లు కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. నరైన్, వరుణ్ వంటి స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొన్నాడని కొనియాడాడు. KKR తమ బౌలింగ్ వనరులను సరిగ్గా వాడుకోలేదని, ముఖ్యంగా పవర్‌ప్లేలో నరైన్‌ను ఆలస్యంగా దించడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని వివరించాడు.

March 30, 2026 / 04:50 PM IST

‘పారిశుద్ధ్య కార్మికులను పెంచాలి’

AKP: పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్‌లో పారిశుధ్య పరిస్థితి సరిగా లేదని స్థానిక వర్తక వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎం రమేష్ నాయుడు, అధ్యక్షుడు టి.నర్సింగరావు తెలిపారు. పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అగనంపూడి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.

March 30, 2026 / 04:50 PM IST

డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీపై రేపు కోర్టు తీర్పు

TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం రేపు తన తుది తీర్పును వెలువరించనుంది. కాగా.. డ్రగ్స్ మూలాలు, నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు పట్టుబడుతున్నారు.

March 30, 2026 / 04:47 PM IST

ప్రజల కష్టాలు తీర్చడమే పోలీసుల అసలైన ఆనందం: ఎస్పీ

అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన PGRSలో ఎస్పీ ధీరజ్ ప్రజల సమస్యలను స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల అసలైన సంతృప్తి అని పేర్కొంటూ, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఇచ్చే ఫిర్యాదులను కూడా సమానంగా పరిగణించి సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

March 30, 2026 / 04:45 PM IST

అమరావతి తీర్మానంపై బొత్స కీలక వ్యాఖ్యలు

AP: అమరావతి చట్టబద్ధత తీర్మానంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకూ పనికిరాదు. రాజధానులపై నిర్ణయం రాష్ట్రాల ఇష్టం. ఎన్ని సంవత్సరాలకు అమరావతి పూర్తవుతుందో చెప్పగలరా. చంద్రబాబు అమరావతి కోసం చేసిన ఖర్చు ఎంత?’ అంటూ ప్రశ్నించారు.

March 30, 2026 / 04:43 PM IST

ఒత్తిడి, నిద్రలేమితో పెరుగుతున్న మైగ్రేన్ ముప్పు

నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, నిద్రలేమి, హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇది సాధారణ తలనొప్పి కాదు, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. యోగా, సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

March 30, 2026 / 04:42 PM IST

గట్టు మైసమ్మ తల్లి జాతరలో మాజీ ఎమ్మెల్యే

BHNG: ఈరోజు బొమ్మలరామారం మండలం కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ గట్టు మైసమ్మ తల్లి జాతరలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కర్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

March 30, 2026 / 04:41 PM IST

పెనుకొండలో రోడ్డు ప్రమాదం

సత్యసాయి: పెనుకొండ మండలం పులేకమ్మ గుడి సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక కారు రోడ్డుపైకి వచ్చిన ఆవును ఢీకొట్టడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా వాహనాలు ఆగిపోవడంతో మరో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని స్థానికులు చెప్పారు. అయితే ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలిపారు. సంఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

March 30, 2026 / 04:41 PM IST

‘ప్రజానాట్యమండలి మహాసభలను జయప్రదం చేయాలి’

NLG: ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే ప్రజానాట్య మండలి 8వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. చిట్యాల మండలం చినకాపర్తి, వెలిమినేడు, పెదకాపర్తి, ఎలికట్టె గ్రామాల్లో సోమవారం మండల కార్యదర్శి జిట్టా స్వామి, స్థానిక నాయకత్వంతో కలిసి ఆయన మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.

March 30, 2026 / 04:40 PM IST

మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వర్షం!

TG: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. గత కొన్ని రోజులుగా HYDలో వింత పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ దెబ్బకు జనం విలవిల్లాడుతుంటే, సాయంత్రం కాగానే వరుణుడు కరుణిస్తున్నాడు. ఉక్కపోత నుంచి ఈ వర్షం నగరవాసులకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ప్రయాణికులు ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

March 30, 2026 / 04:38 PM IST