NZB: ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ జిల్లా యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐఎంల్ మాస్‌లైన్ నాయకులు పాల్గొన్నారు. యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు సాగింది.