BHPL: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం గోరికొత్తపల్లి గ్రామపంచాయతీలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు గ్రామ సభ నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నిమ్మల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ ఉదయం 9 గంటల లోపు గ్రామ సభకు హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని ఆయన కోరారు.