ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మార్కెట్ శాఖ అధికారులు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే, 4, 5 తేదీల్లో వారాంతపు సెలవుల కారణంగా మూడు రోజులు సెలవులు ప్రకటించడం జరిగిందని చెప్పారు. తిరిగి ఈ నెల 6వ తేదీ నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించి సహాకరించాలన్నారు.