GNTR: పొన్నూరు(మం) చింతలపూడిలో ఆస్తి వివాదం యాసిడ్ దాడికి దారితీసింది. గ్రామానికి చెందిన మారుపూడి సుబ్బయ్య (65) అదే గ్రామానికి చెందిన కోడూరు శ్రీనివాసరావు (65)పై యాసిడ్తో దాడి చేశాడు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.